అల్లు అర్జున్ సినిమాలని ఎంత సరదాగా చేస్తాడో.. తన విషయమేదైనా మీడియాలో పర్ఫెక్ట్ గా ప్రాజెక్ట్ అయ్యేలా చూసుకుంటాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అల్లు అర్జున్ స్పెషల్ గా పీఆర్ టీమ్ ని పెట్టుకుని మీడియా ఫోకస్ తనపై ఉండేలా చూసుకుంటాడు. ముఖ్యంగా నేషనల్ అవార్డు విన్ అయినప్పుడు అల్లు అర్జున్ ప్రతికదలికని మీడియాలో హైలెట్ అయ్యేలా చూసుకున్నాడు. అయితే పుష్ప 1 తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ అంతకు ముందు నుంచే బాలీవుడ్ మీడియా విషయంలో అల్లు అర్జున్ చాలా ప్లానింగ్ తో ఉన్నాడు.
అయితే పుష్ప 1 విషయంలో సోషల్ మీడియాలో, మీడియాలో వచ్చిన ఫీడ్ బ్యాక్ మొత్తం అల్లు అర్జున్ సేకరించాడట. ఆ విషయంలో అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వకపోయినా.. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి కామెంట్ చూస్తాడట. పుష్ప 1 లో ఏ మిస్టేక్ జరిగిందో, అలాగే ఏ సన్నివేశంపై ఏయే విమర్శలొచ్చాయో అవన్నీ పార్ట్ 2 లో రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నారంటూ అనసూయ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అనసూయ పుష్ప లో కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
మరి సోషల్ మీడియా మీద అల్లు అర్జున్ అంతగా ఫోకస్ పెట్టాడంటే పుష్ప ద రైజ్ కి మించి పుష్ప ద రూల్ ఉంటుంది అని అర్ధమైపోతుంది. దీనిని బట్టి అల్లు అర్జున్ కొత్త ప్లాన్ లో ఉన్నట్లేగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 మూవీ వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగష్టు 15 న విడుదలకు రెడీ అవుతుంది.