సింగర్ దామిని భట్ల బిగ్ బాస్ సీజన్ 7 లోకి వెళ్లి అక్కడ వంటలక్కగా ఫేమస్ అయ్యి మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. శివాజీ దామిని ఆటని ఎత్తి చూపుతూ వేసిన నామినేషన్, టేస్టీ తేజ సిల్లీ నామినేషన్ తో దామిని ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఆమెకి బిగ్ బాస్ రీ ఎంట్రీ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది. రతిక, శుభశ్రీ, దామినిలలో ఒకరిని హౌస్ లోకి పంపించేందుకు ఓట్స్ వెయ్యమనగా అందరికన్నా దామినికే ఎక్కువ ఓట్స్ వచ్చినా ఉల్టా పూల్టా అంటూ తక్కువ ఓట్స్ వచ్చిన రతికని హౌస్ లోకి పంపించారు.
తాజాగా దామిని భట్ల ఓ ఇంటర్వ్యూలో రతిక-రాహుల్ గురించి మాట్లాడింది, రతిక హౌస్ లో నా మాజీ బాయ్ ఫ్రెండ్ అంటూ రాహుల్ గురించి పదే పదే చేప్పడం బయట రాహుల్ తో రిలేషన్ లో ఉన్న ఫొటోస్ లీకవడం అన్ని సెన్సేషన్ అయ్యాయి. దామిని ఎలిమినేట్ అయ్యి ఇంటికెళ్ళగానే రాహుల్ వచ్చి కలిసి హౌస్ లో ఏం జరిగిందో అడిగివెళ్ళాడు, అది వాళ్ళ పర్సనల్ మేటర్ అంటూ చెప్పింది.
అయితే ఈ సీజన్ లో ఎవరికి వారే కష్టపడి ఆడుతున్నారు. హౌస్ లోకి సైలెంట్ గా రైతు బిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఆట మాత్రం చాలా బావుంటుంది. పల్లవి ప్రశాంత్ బుద్ది బలమే కాదు, కండబలం కూడా అదిరిపోతోంది. తెలివిగా ఆడుతున్నాడు. కానీ నామినేషన్స్ అప్పుడే అతని యాటిట్యూడ్ ఎవ్వరికి నచ్చదు. అది నాకు కూడా నచ్చదు. హౌస్ లో ఉన్న వాళ్లందరిలో పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్. అతనే ఈ సీజన్ విన్నర్ అవుతాడంటా దామిని తన ఒపీనియన్ చెప్పింది.