రష్మిక మందన్నాకి సంబంధించి ఓ మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగా ఆ వీడియోలో ఉన్నది రశ్మికనే అనుకునేలా ఆ వీడియో ఉంది. దానిని చాలామంది వైరల్ చేస్తున్నారు. అయితే రష్మిక మందన్న ఆమార్ఫింగ్ వీడియోపై రియాక్ట్ అయ్యింది. డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడటానికి నేను ఎంతో బాధపడుతున్నాను. ఇది చూస్తే టెక్నాలజీ ఎంతగా దుర్వినియోగం అవుతుందో అర్ధం అవుతుంది. ఈ వీడియో చూసాక నాలాంటి ఎంతోమందిని భయానికి గురి చేస్తోంది అంటూ రష్మిక ట్వీట్ చేసింది.
అసలు ఇలాంటి ఘటన నా కాలేజీ డేస్ లో లేదా స్కూల్ డేస్ లో జరిగి ఉంటే.. దీని నుంచి ఎలా బయటపడాలో, ఎదుర్కోవాలో కూడా నాకు తెలిసేది కాదు. ఒక నటిగా నన్నెంతగానో సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ, స్నేహితులు, శ్రేయోభిలాషులకు నా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ అలాగే తనకు సపోర్ట్ చేసిన అమితాబ్ కి రష్మిక థాంక్స్ చెప్పింది. అటు రష్మిక ఫేక్ వీడియో పై సోషల్ మీడియాలో రశ్మికకి మద్దతు పెరుగుతుంది.
తాజాగా BRS నేత కల్వకుంట్ల కవిత ఈ వీడియో పై స్పందించారు.
సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలి
తగిన చర్యల రూపకల్పన కోసం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి
సైబర్ ముప్పు నుంచి మహిళలను కాపాడాల్సిన తక్షణ అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
సినీ హీరోయిన్ రష్మిక మందన్న పై దుండగులు డీప్ ఫేక్ వీడియోను సృష్టించడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సైబర్ ముప్పు నుంచి మహిళలను రక్షించాల్సిన తక్షణ అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. రక్షణా చర్యలను సమగ్రంగా రూపొందించడం కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు.