శర్వానంద్ కొద్దిరోజుల పాటు సినిమాలకి బ్రేక్ ఇవ్వనున్నాడు. ఆయన తన ఫ్యామిలీకి సమయం కేటాయించాలనుకుంటున్నాడు. నాలుగు నెలల క్రితమే రక్షిత రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న శర్వానంద్ ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు. రక్షిత రెడ్డి అమెరికాలో జాబ్ చేస్తుంది. లాక్ డౌన్ సమయంలో ఆమె ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న జంట ఈ ఏడాది జూన్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత శర్వానంద్ తన సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తవడంతో శర్వానంద్ ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడట.
తన భార్య రక్షిత తో కొద్దిరోజులు గడిపేందుకు ఆయన అమెరికాకి వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో ఆయన అమెరికా ప్రయాణం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. తన భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఈ సమయంలో శర్వానంద్ భార్య పక్కనే కొద్దిరోజులు ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట, బిడ్డ పుట్టేవరకు శర్వానంద్ భార్యకి తోడుగా ఉండాలనుకుంటున్నాడట. రక్షిత ఎక్కువగా అమెరికాలో ఉంటుంది కాబట్టి శర్వా - రక్షితలు తమ బిడ్డకి అమెరికాలో జన్మనివ్వనున్నారని తెలుస్తుంది.
ఇక ఇపుడు అమెరికాకి బయలుదేరే శర్వానంద్ రెండు మూడు నెలలు అక్కడే ఉండబోతున్నాడట. ఆ తర్వాత ఆయన తన తదుపరి ప్రాజెక్ట్స్ మొదలు పెడతాడని తెలుస్తుంది.