ఓ పది రోజుల ముందు అమలా పాల్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తన బర్త్ డే సందర్భంగా తనకి తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ కూడా పూర్తయినట్లుగా చెప్పి అందరికి షాకిచ్చింది. గతంలో కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలా పాల్ తర్వాత విజయ్ తో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి సింగిల్ గానే లైఫ్ ని లీడ్ చేస్తున్న అమలా పాల్ మళ్ళీ ఇన్నాళ్ళకి రెండో పెళ్లిపై మనసు పారేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్, ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్ ని వివాహం చేసుకుంటున్నట్టుగా అతను ప్రపోజ్ చేసిన ఫొటోస్ తో ప్రకటించింది.
ఇక ఎంగేజ్మెంట్ అయిన పది రోజులకే అమలా పాల్ పెళ్లి పీటలెక్కేయ్యబోతుంది.. ఇప్పటికే అమలా పాల్ పెళ్లి వేడుకలు మొదలైపోయాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మొదలైంది. ఈలోపులోనే అమలా పాల్ పెళ్లి ఫొటోస్ బయటికి వచ్చాయి. అమలా పాల్ ని వివాహం చేసుకున్న జగత్.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేసాడు. Two souls , one destiny, walking hand-in-hand with my divine feminine, for the rest of this lifetime. 💜🪬💫 #married #twinflame రెండు మనస్సులు ఒక్కటైన వేళ.. జీవితాంతం ఈ చెయ్యి వదలను అంటూ క్యాప్షన్ జోడించి పెళ్లి పిక్స్ ని షేర్ చేసాడు.
అమలాపాల్ లావెండర్ కలర్ క్రాప్ టాప్ లో మెరిసిపోగా.. జగత్ దేశాయ్ కూడా అమలా పాల్ కి మ్యాచ్ అయ్యే వెడ్డింగ్ అవుట్ ఫిట్ లో ఇద్దరూ రొమాంటిక్ గా అదరగొట్టేసాడు. ప్రస్తుతం అమలా పాల్ రెండో పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.