ఈరోజు ఆదివారం నిద్ర లేచి సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే మహేష్ బాబు-వెంకటేష్ కలిసి టేబుల్ పై కార్డ్స్ ఆడుతున్న పిక్ కనిపించింది. అది చూసిన కొంతమంది ఇది ఎప్పటిది, పెద్దోడు చిన్నోడు కలిసి ఇలా అంటూ నోళ్లు నొక్కుకున్నారు. మరికొంతమంది ఏంటి.. మహేష్ బాబు కార్డ్స్ ఆడతాడా.. ఇలా ఓ టేబుల్ పై కూర్చుని ప్రముఖులతో కనిపించగానే అందరూ షాకైపోయారు. ఏ హీరో అయినా ఇలా చేసాడంటే ఇంత ఆశ్చర్యపోయేవారు కాదు. కానీ అక్కడ ఉన్నది మహేష్.
మహేష్ ఎప్పుడూ ఇలాంటి పార్టీలో కానీ, వేరే హీరోలతో కలిసి ఎంజాయ్ చేయడమనేది పెద్దగా కనిపించదు. ఆయన ఫ్యామిలీకి కూడా హీరో. ఎక్కువగా కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రముఖుల పార్టీలకి హాజరైనా చాలా హుందాగా భార్యతో కలిసే హాజరయ్యే మహేష్ ని అలా చూసేసరికి అందరూ నిజంగానే షాకయ్యారు. అయితే మహేష్ గత రాత్రి ఒక ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన క్లబ్ హౌస్ ఓపెనింగ్ కి విక్టరీ వెంకటేష్ తో కలిసి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రాజకీయనేతలతో పాటుగా ఫిలిం సెలబ్రెటీలు కూడా పాల్గొన్నారు. దానం నాగేందర్ ఇలా చాలామంది ఆ మహేష్-వెంకటేష్ క్లబ్బులో కార్డ్స్ ఆడుతున్న టేబుల్ దగ్గర కనిపించారు. ఆ క్లబ్బు ఓపెనింగ్ కి వెళ్ళిన మహేష్, వెంకటేష్ అలాగే మరికొంతమందితో కలిసి సరదాగా పేకాట ఆడిన పిక్ అది. అంతేకాని మహేష్ ఇలా ఎప్పుడూ కనిపించలేదు, కనిపించరు కూడా అంటూ మహేష్ అభిమానులు ఇతరుల అపార్ధాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.