సూపర్ స్టార్ రజినీకాంత్ కి రాఘవ లారెన్స్ వీరాభిమాని. రాఘవ లారెన్స్ చంద్రముఖికి సీక్వెల్ గా చంద్రముఖి 2 చేస్తున్నప్పుడు రజినీకాంత్ దగ్గరకి వెళ్లి బ్లెస్సింగ్ తీసుకున్నాడు. విడుదలకు ముందు కూడా ఆయన్ని కలిసాడు. రజినీకాంత్ సర్ కి చెప్పే ఈ సినిమాకి సీక్వెల్ చేసానని చాలా సందర్భాల్లో రాఘవ చెప్పుకొచ్చాడు. అయితే చంద్రముఖి 2 మాత్రం రాఘవ లారెన్స్ అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కి లారెన్స్ విలన్ గా కనిపించబోతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జైలర్ సక్సెస్ తర్వాత రజినీకాంత్ కుమార్తె డైరెక్షన్ లో లాల్ సలామ్ లో నటించారు. ఆ చిత్రం తర్వాత రజినీకాంత్ జై భీమ్ దర్శకుడితోనూ, లోకేష్ కనగరాజ్ తోనూ సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యారు. అయితే ఈ రెండు చిత్రాలలో ఒకటైన తలైవర్ 171 లో రజినీకాంత్ కి రాఘవ లారెన్స్ విలన్ గా నటించబోతున్నాడంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. కొరియోగ్రాఫర్ స్థాయి నుంచి హీరోగా టర్న్ అయ్యి సక్సెస్ అయిన రాఘవ లారెన్స్ నిజంగానే రజినీకాంత్ కి విలన్ గా నటిస్తే దానికుండే క్రేజ్ మాములుగా ఉండదు.