ఎప్పటినుంచో గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ గురించి మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మేకర్స్ గత రెండు నెలలుగా అదిగో ఇదిగో అంటూ చెప్పడమే కానీ.. ఆ అప్డేట్ ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ బర్త్ డే కి గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అంటూ నిన్న పోస్టర్ తో కన్ ఫర్మ్ చెయ్యడం, నెక్స్ట్ డే అంటే ఈ రోజు ప్రోమోతో మేకర్స్ మహేష్ అభిమానులని సర్ ప్రైజ్ చేసారు. గుంటూరు కారం ధమ్ మసాలా బిర్యానీ, ఎర్ర కారం అరకోడి, నిమ్మసోడా ఫుల్ బీడీ, గుద్దిపారేయ్ గుంటూర్ని సాంగ్ ప్రోమో తో ఆ సాంగ్ పై అంచనాలు పెంచేశారు.
ఆ ప్రోమోలో గుంటూరు కారం మిర్చి ఘాటు గురించి క్లియర్ గా చూపించారు. మహేష్ బాబు గుంటూరు కారం ఫస్ట్ లుక్ లో చూసినట్టుగానే మాస్ గా మళ్ళీ బీడీ కాలుస్తూ కనిపించారు. ఇది హీరో ఇంట్రో సాంగ్ అని చెప్పకనే చెప్పేసారు. మహేష్ బాబు ఈ సాంగ్ ప్రోమోలో కనిపించిన తీరుతో మహెష్ ఫాన్స్ అయితే ఫుల్ హ్యాపీ. కాస్త లేట్ అయినా ఈ సాంగ్ లేటెస్ట్ గా ఉంటుంది అని ప్రోమో చూసిన వారు చెబుతున్నారు. ఈ పాటని నవంబర్ 7 న తివిక్రమ్ పుట్టిన రోజుకి విడుదల చెయ్యబోతున్నారు.