మెగా హీరోలతో వరసగా సినిమాలు చేసినా పెద్దగా ఫేమస్ అవ్వలేకపోయిన అను ఇమ్మాన్యువల్ కి ఇప్పుడు కోలీవుడ్ అయినా ఆమెకి కాస్త హెల్ప్ చేస్తుందేమో చూడాలి. గ్లామర్ చూపిస్తూ హీరోయిన్ గా నిలదొక్కుకోవాలనుకున్న అను ఇమ్మాన్యువల్ అందాన్ని టాలీవుడ్ పక్కనబెట్టేసింది. అల్లు శిరీష్ తో ఉర్వశివో రాక్షసీవో సినిమా సక్సెస్ ఆమెని టాలీవుడ్ కి దగ్గర చేస్తుంది అనుకున్నారు. కానీ ఆ చిత్రం తర్వాత అను ఇమ్మాన్యువల్ కి టాలీవుడ్ అవకాశాలు రాలేదు.
తమిళంలో కార్తీ జపాన్ మూవీలో అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రంలోనూ అను ఇమ్మాన్యువల్ గ్లామర్ పాత్ర చేసింది అని ఆ చిత్ర ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అంతేకాదు.. జపాన్ ప్రమోషన్స్ లోను అను ఇమ్మాన్యువల్ గ్లామర్ గా శారీ కట్టి అందాన్ని చూపిస్తుంది. జపాన్ ఈవెంట్స్ లో అను ఇమ్మాన్యువల్ అందాలని చూసి ఇంత అందాన్నా టాలీవుడ్ పక్కనబెట్టింది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగానే టాలీవుడ్ వదులుకున్న అందాన్ని కోలీవుడ్ అయినా క్యాష్ చేసుకుంటుందేమో చూడాలి.