ఇప్పుడు మెగా అభిమానుల హోప్స్-మహేష్ ఫాన్స్ హోప్స్ అన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మీదే. ఎదుకంటే ఈ దివాళికి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో రాబోతున్న రెండు పెద్ద సినిమాల ఫస్ట్ సింగిల్స్ విడుదల కాబోతున్నాయి. ముందుగా మహేష్ బాబు-త్రివిక్రమ్ గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ ఈ నెల 7 న విడుదలవుతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అసలే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ పై ఎన్నో రోజుల నుంచి భారీ అంచనాలు, క్రేజ్ ఉన్నాయి. అవి థమన్ అందుకోవాల్సి ఉంది.
ఆ తర్వాత దివాళికి రామ్ చరణ్-శంకర్ ల ప్యాన్ ఇండియా ఫిల్మ్ గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ అంటూ దసరా రోజున మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్ లేక మెగా అభిమానులు ఆకలిమీదున్నారు. సో ఈ ఫస్ట్ సింగిల్ సక్సెస్ అనేది వీళ్ళకి పరువుతో సమానం. మరి థమన్ గేమ్ ఛేంజర్ సాంగ్ కి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో అనే అతృతతో మెగా అభిమానులు ఉన్నారు. ఈ రెండు పాటల్లో ఒకరిది ఎక్కువ, ఒకరిది తక్కువ అయినా.. ఫాన్స్ ఊరుకోరు. రెండూ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే.
అందులో ఏ చిన్న పొరబాటు జరిగినా అభిమానుల ఆగ్రహానికి థమన్ బలి కావాల్సిందే. అటు మెగా అభిమానులు, ఇటు ఘట్టమనేని అభిమానులు ఇద్దరూ థమన్ మీదే హోప్స్ పెట్టుకుని ఉన్నారు. మరి రాబోయే గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్స్ ఎలా ఉండబోతున్నాయో జస్ట్ వెయిట్ అండ్ సి.