బిగ్ బాస్ అంటేనే శనివారం అనేది నాగార్జున స్కూల్ మాస్టర్ లా మారిపోయి హౌస్ మేట్స్ కి పాఠాలు చెబుతూ వారు చేసిన తప్పులని ఎత్తి చూపుతూ క్లాస్ ఇస్తారనేది తెలిసిందే. వారం మొత్తం హౌస్ లో ఏం జరిగిందో.. ఎవరి బిహేవియర్ ఎలా ఉందో అనేది జెడ్జ్ చేస్తూ వారి తప్పులని సరిద్దిదుకోమని సలహా ఇస్తారు. ఇక తప్పు చేసిన వారిని వీడియోలతో సహా ప్రూఫ్ లు చూపించి మరీ వారిని నాగార్జున వాయ తీస్తారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం శనివారం ఎపిసోడ్ కూల్ గానే మొదలయ్యింది.
జపాన్ మూవీని ప్రమోట్ చేసేందుకు నాగార్జున కార్తీని బిగ్ బాస్ స్టేజ్ పైకి తీసుకొచ్చి హౌస్ మేట్స్ ని కూల్ చేసారు. ఆ తర్వాత కార్తీని పంపేసి.. నాగార్జున సీరియస్ గా క్లాస్ మొదలు పెట్టారు. శోభా కెప్టెన్ అయినందుకు కంగ్రాట్స్ చేసారు. అమరదీప్ శోభా కోసం కసిగా బాగా ఆడినందుకు క్లాప్స్ కొట్టించారు. శోభా గేమ్ బంగారం అని డిసైడ్ చేసారు. ఆ తర్వాత తేజ అడిగిన అనుమానాన్ని నాగ్ క్లియర్ చేసారు.
గౌతమ్ చెప్పుడు మాటలు విని మైండ్ చెడగొట్టుకున్నాడు అని.. అశ్విని కి క్లాస్ పీకారు. గౌతమ్ కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి శివాజీ నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ నాగార్జునతో మాట్లాడాడు. గౌతమ్ బయటికొచ్చాక నాగార్జున మేటర్ క్లియర్ చేసే ప్రయత్నం చేసారు. గౌతమ్ కి శివాజీ అన్యాయం చేసాడని ఎవరనుకుంటున్నారో చెప్పమనగానే అందరూ సైలెంట్ గా ఉండగా.. అశ్విని మాత్రమే చెయ్యెత్తింది. అశ్విని పెట్టిన పుల్ల వలనే గౌతమ్ అపార్ధం చేసుకున్నాడని నాగ్ చెప్పారు.
ఆ తర్వాత యావర్, రతిక టాస్క్ గురించి కూడా నాగార్జున గట్టిగానే మాట్లాడారు. పల్లవి ప్రశాంత్ ఏడుస్తుండగా.. ఎందుకు అలా ఏడుస్తున్నావ్ అని నాగ్ అనగానే శివాజీ వాడు అంతే సార్.. నేను 50 డేస్ నుంచి చూస్తున్నా అది వాడి నేచర్ అనగానే నాగార్జున ఏంటి శివాజీ పల్లవి ప్రశాంత్ ని అనగానే నువ్వు సపోర్ట్ కి వచ్చేస్తున్నావ్. మిగతా వారికి ఎందుకు సపోర్ట్ చెయ్యమంటూ శివాజీ కి కూడా నాగార్జున క్లాస్ పీకారు.