జబర్దస్త్ లోకి యాంకర్ గా అడుగుపెట్టి అందచందాలు, టాలెంట్ తో ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై తన ప్రత్యేకతని చాటుతున్న అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు బుల్లితెరని పూర్తిగా పక్కనబెట్టింది. హీరోయిన్ కి ఉండాల్సిన అందం, గ్లామర్ అన్ని అనసూయలో ఉన్నాయి. ఆమె కూడా హీరోయిన్ అవుదామని కలలు కన్నది. కానీ అనసూయ కి హీరోయిన్ ఛాన్సెస్ మాత్రం ఆమడదూరంలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతున్న అనసూయకి సిల్వర్ స్క్రీన్ ఈ మధ్యన వరసగా షాకులు తగులుతున్నాయి. వరస ప్లాప్ లు అనసూయని చిరాకు పెడుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెద్ద కాపు1 ప్లాప్ పై అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. అదే ఇంటర్వ్యూలో అనసూయ అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ వదులుకోవడం, దర్శకుడు త్రివిక్రమ్ కి సారి చెప్పడంపై కూడా స్పందించింది. అయితే తనకి హీరోయిన్ గా అవకాశాలు ఎందుకు రాలేదో అనేది వివరించింది. షూటింగ్స్ లో నా పని పూర్తి కాగానే నా ఫ్యామిలీ కోసం నేను ఇంటికి వెళ్ళిపోతాను. సినిమా తర్వాత పార్టీలకి హాజరైతేనే హీరోయిన్ గా ఛాన్సెస్ వస్తాయి. అందుకే నేను హీరోయిన్ కాలేకపోయాను.
అలా పార్టీలకి వెళితేనే అవకాశాలు వస్తాయంటే నేను వాటిని ప్రోత్సహించను. ఒకప్పుడు ఏదైనా అవకాశం వస్తే దానిలో నాకే ప్రాధాన్యత ఉండాలని కోరుకునేదాన్ని. కానీ ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా గుర్తింపు వస్తుంది అనే నమ్మకం కలిగింది.. అంటూ అనసూయ హీరోయిన్ అవకాశాలు ఎందుకు రాలేదో చెప్పుకొచ్చింది.