చంద్రబాబు స్కిల్ డెవెలెప్మెంట్ కేసులో అరెస్ట్ అవడంతో జనసేన నేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుని రాజమండ్రి జైల్లో కలిసిములాఖత్ అయ్యి అక్కడి నుంచి బయటికొచ్చి లోకేష్-బాలకృష్ణ సాక్షిగా టీడీపీ-జనసేన పొత్తుని ప్రకటిస్తూ వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడుతున్నట్టుగా ఎనౌన్స్ చేసారు. ఆ ప్రకటనఏపీ రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టించింది. కొన్నాళ్ళకి లోకేష్-పవన్ కళ్యాణ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మరోసారి తమ పొత్తు ఎంత స్ట్రాంగ్ అనేది చూపించారు.
అయితే చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. ఆయన విడుదల గురించిన న్యూస్ తెలియగానే.. చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు. అసలైతే చంద్రబాబు విడుదల కాగానే పవన్ మీటయ్యి ఆయన్ని పరామర్శించేవారు. కానీ పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబు కొడుకు పెళ్లి కోసం ఇటలీ వెళ్లారు. నాలుగురోజులుగా పవన్ కళ్యాణ్ పెళ్లి వేడుకల కోసం ఇటలీలోనే ఉన్నారు. నిన్ననే పవన్ కళ్యాణ్ ఇటలీ నుంచి హైదరాబాద్ కి వచ్చారు.
ప్రస్తుతం చంద్రబాబు కూడా నిన్నటి నుంచి మెడికల్ చెకప్ లో ఉన్నారు. దాని కోసం AIG ఆసుపత్రికి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఆయన హెల్త్ చెకప్ పూర్తి చేసుకున్నారు. ఇక ఈరోజు ఆయన హైదరాబాద్ లోని LV ప్రసాద్ హాస్పిటల్ కి వెళ్లనున్నారు. ఈ రెండు పనులు పూర్తి కాగానే.. జనసేన నేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలిసి పరామర్శించే అవకాశం ఉంది అంటున్నారు. ఆయన్ని పర్సనల్ గా మీటయ్యి చంద్రబాబుని పలకరించాలని పవన్ అనుకున్నారని.. అది ఈరోజా.. రేపా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.