బిగ్ బాస్ సీజన్ 7 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానే ప్రాజెక్ట్ అవుతున్న శోభా శెట్టి.. నోరు మాత్రం చాలా పెద్దది. ఎవరితోనైనా గొడవ పడితే శోభా శెట్టి నోరు హౌస్ మొత్తం దద్దరిల్లేలా మాట్లాడుతుంది. ఆమె మాటలు కొట్టినట్లుగా ఉంటాయి. శోభా శెట్టి బిహేవియర్ విషయంలో శివాజికి అస్సలు నచ్చదు. ఆమెని ఎలాగైనా ఇంటి నుంచి బయటికి పంపించాలని అనుకుంటూ ఉంటాడు. అతని గ్యాంగ్ లో వారు ఆమెని నామినేట్ చేసేలా ప్రిన్స్ యావర్ ఇలా కొంతమందిని రెచ్చగొడుతూ ఉంటాడు. తేజ శోభా శెట్టి తో స్నేహం చెయ్యడంతో శివాజీ వారిని విడగొట్టాలని తేజని దువ్వుతూ కనిపిస్తాడు.
అయితే ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో శోభా శెట్టికి బదులు అమర్, తేజకి బదులు ప్రియాంక, అర్జున్ కి బదులు శివాజీ, రతికకి బదులు భోలే ఇలా లాస్ట్ టాస్క్ లో పోటీ పడగా.. ఆ గేమ్ లో చివరికి అమర్ గెలిచి శోభకు కెప్టెన్సీ కట్టబెట్టాడు. ఈవారం కెప్టెన్ శోభా శెట్టి అమర్ కి థాంక్స్ చెబుతూ లోగో తీసుకుంది. అప్పుడు శివాజీ హెల్త్ రీజన్స్ తో లోపలే ఉన్నాడు. శోభా శెట్టి పేరు బిగ్ బాస్ అనౌన్స్ చెయ్యగానే శివాజి తలపట్టుకోవడం చూసిన నెటిజెన్స్ ఏంటి శివాజీ శోభా శెట్టి కెప్టెన్ అవడం తట్టుకోలేకపోతున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.శివాజీ నీకు శోభపై అంత కోపమెందుకు అంటున్నారు.
ఇక ఈ గేమ్ లో యావర్ ని పక్కనబెట్టి అర్జున్ ఆట శివాజీ ఆడడం యావర్ కి నచ్చలేదు. అదే పాయింట్ శివాజీ దగ్గర తియ్యగా.. చివరికి అమర్, గౌతమ్, ప్రియాంక వాళ్ళ ముగ్గురే ఆడాలనుకున్నారు. అదే వాళ్ళ స్ట్రాటజీ. అందుకే నిన్ను పక్కనబెట్టి నేను వెళ్ళా.. లేదంటే నువ్వు ఓడిపోయేవాడివి అంటూ ప్రిన్స్ యావర్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాడు. ఇక శివాజీ బ్యాచ్ పల్లవి ప్రశాంత్, భోలే, రతిక వాళ్ళకి కూడా శివాజీ చేసిన పని నచ్చక గ్రూప్ డిస్కర్షన్ పెట్టారు.