Advertisementt

గుంటూరు కారం హింట్ ఇచ్చిన నాగవంశీ

Sat 04th Nov 2023 12:16 PM
naga vamsi  గుంటూరు కారం హింట్ ఇచ్చిన నాగవంశీ
Naga Vanshi update on Guntur Kaaram first single గుంటూరు కారం హింట్ ఇచ్చిన నాగవంశీ
Advertisement
Ads by CJ

ఫైనల్లీ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ పై నాగవంశీ హింట్ ఇచ్చాడు. కొద్దిరోజులుగా ఈవారంలోనే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ఉంటుంది అని చెబుతున్నా చాలామందిలో ఎక్కడో ఏదో అనుమానం.. ఎప్పటిలాగే పోస్ట్ పోన్ అంటారేమో అని. దానికి నాగవంశీ కూడా ఫస్ట్ సింగిల్ పై ఉన్న అంచనాలే ఈ సాంగ్ రావడానికి లేట్.. ఆ అంచనాలు అందుకోవాలని పదే పదే ఫస్ట్ సింగిల్ ని చెక్ చేసుకుంటున్నారు అని. ఇక ఈవారంలో ఖచ్చితంగా గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ఉంటుంది అని నాగవంశీ రీసెంట్ గానే చెప్పాడు.

అనుకున్నట్టుగానే ఈనెల 7 న గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ రాక కన్ ఫర్మ్ అన్నట్టుగా నాగ వంశీ ట్వీట్ చేసాడు. 7 💥🧨 అంటూ నాగవంశీ నవంబర్ 7 న త్రివిక్రమ్ బర్త్ డే కి గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ఉంటుంది.. క్రాకర్స్ తో పండగ చేసుకోవడానికి రెడీగా ఉండండి అని అర్ధం వచ్చేలా ఇండైరెక్ట్ గా ట్వీటేసాడు. దానితో మహేష్ అభిమానుల్లో ఉత్సహం పెల్లు బీకింది. అసలే గుంటూరు కారం ఫిస్ట్ సింగిల్ ఆడియో ట్రాక్ లీక్ అనే వార్త వాళ్ళని గాబరపెట్టేసింది.

ఇంతలోనే నాగవంశీ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ పై ఇచ్చిన హింట్ తో వారు కాస్త తేలికపడ్డారు. ఇక మహేష్-శ్రీలీలపై తీసిన పాటనే ఫస్ట్ సింగిల్ గా వదులుతున్నారని తెలుస్తుంది. మరి మరో రెండు రోజుల్లో మహేష్ అభిమానులకు పండగే. దివాళిని కూడా ఓ వారం ముందుగానే జరుపుకోవడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు.

Naga Vanshi update on Guntur Kaaram first single:

Naga Vamsi tweet on Guntur Kaaram first single date

Tags:   NAGA VAMSI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ