గత వారం రోజులుగా ఇటలీలో మకాం వేసిన మెగా ఫ్యామిలీ హీరోలు ఒక్కొక్కరిగా తిరిగి హైదరాబాద్ లో అడుగుపెడుతున్నారు. నిన్న శుక్రవారం పవన్ కళ్యాణ్ ఇటలీ నుంచి హైదరాబాద్ కి చేరుకున్న ఎయిర్ పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఈ రోజు కొత్త జంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు హైదరాబాద్ కి చేరుకున్నారు. మొన్న బుధవారం నవంబర్ 1 న పెద్దల సాక్షిగా పేమ వివాహం చేసుకున్న వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిలు ఆ రోజు సాయంత్రమే అక్కడ గెస్ట్ ల మధ్యన టుస్కనీలోనే రిసెప్షన్ కూడా పూర్తి చేసుకున్నారు.
రెండు రోజులుగా ఇటలీలోనే ఉన్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఈ రోజు శనివారం ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరు కూడా భార్య సురేఖ, మనవరాళ్లు, తన చిన్న కుమార్తె శ్రీజ, మానవరాలితో ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించారు. ఇక రేపు సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వెడ్డింగ్ రిసెప్షన్ జరగబోతుంది. పెళ్ళికి కుటుంభ సభ్యులు, స్నేహతులు మాత్రమే హాజరు కాగా.. రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తుంది.
ఇటలీలోని టుస్కనీ నగరంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పవన్ కళ్యాణ్, మెగా స్టార్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరూ తమ భార్యలతో వరుణ్ తేజ్ పెళ్ళిలో సందడి చేసిన ఫొటోస్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరలవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్త జంట హైదరాబాద్ లో దిగిన పిక్స్ వైరల్ గా మారాయి.