Advertisement

చంద్రబాబును కేసీఆర్ కలవనున్నారా..

Sat 04th Nov 2023 10:31 AM
kcr  చంద్రబాబును కేసీఆర్ కలవనున్నారా..
Will KCR meet Chandrababu? చంద్రబాబును కేసీఆర్ కలవనున్నారా..
Advertisement

నాలుగు వారాల బెయిల్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. భారీ వెహికిల్ ర్యాలీ చంద్రబాబు ఇంటి వరకూ కొనసాగింది. ఇక టీడీపీ తన ఫోకస్ అంతా ఏపీపైనే పెట్టిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంది. టీడీపీ తప్పుకుందని తెలిసిన దగ్గర నుంచి పార్టీలన్నీ టీడీపీపై ఫోకస్ పెట్టాయి. టీడీపీ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాయి. 

బీఆర్ఎస్‌కు దూరమవుతున్నారా?

తొలుత చంద్రబాబు అరెస్ట్ సమయంలో మంత్రి కేటీఆర్ అనూహ్య వ్యాఖ్యలు చేసి సెటిలర్స్‌తో పాటు టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించి డ్యామేజ్ కంట్రోల్‌గా యత్నించారు. ఆ తరువాత నారా లోకేష్ బాధను తన బాధగా ఫీలయ్యారు. అయినా సరే.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని టాక్. టీడీపీ నేతలు, సీమాంధ్రులంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీమాంధ్రులంతా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మారిపోయారని తెలుస్తోంది. మొత్తానికి పెద్ద ఎత్తున ఓట్లు బీఆర్ఎస్‌కు దూరమవుతున్నాయని భావించిన బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యిందని టాక్. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పెద్ద స్కెచ్చే గీసిందని ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్‌ నేతల్లో మిశ్రమ స్పందన..

టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించే వంకతో కేసీఆర్ ఆయనను కలిస్తే ఎలా ఉంటుందని చర్చించుకుంటున్నారట. తద్వారా స్వామి కార్యం.. స్వకార్యం రెండు పూర్తి చేయాలని భావిస్తున్నారట. గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో అయితే సెటిలర్స్ ఓట్లన్నీ గులాబీ పార్టీకే పడ్డాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుున్నారట. చంద్రబాబును కలిసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీయనున్నారట. తద్వారా తాము టీడీపీకి కానీ... చంద్రబాబుకు కానీ వ్యతిరేకం కాదని పరోక్షంగా జనానికి తెలియజెప్పాలనుకుంటున్నారట. అయితే బీఆర్ఎస్‌ నేతల్లో దీనిపై మిశ్రమ స్పందన లభిస్తోందట. టీడీపీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చేది ఒక్క కమ్మ సామాజిక వర్గమేనని.. మిగిలిన ఆంధ్రులంతా అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని నచ్చజెబుతున్నారట. ఏది ఏమైనా కానీ ఇప్పుడు ప్రతి ఓటూ కీలకమే కాబట్టి చంద్రబాబును కలిస్తే బాగుంటుందని కేసీఆర్ యోచిస్తున్నారట.

Will KCR meet Chandrababu?:

KCR meets Chandrababu in HYderabad?

Tags:   KCR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement