రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తర్వాత అంతటి రేంజ్ లో పేరొస్తుంది.. ఇకపై అనసూయ ని మరోలా చూస్తారు అంటూ పెద్దకాపు1 మూవీ ప్రమోషన్స్ లో అనసూయ చెప్పిన మాటలేవి.. ఆ సినిమా చూసాక నమ్మాలనిపించలేదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొత్తవాళ్లతో తెరకెక్కిన పెద్దకాపు1 మూవీని ఆడియన్స్ మొదటి రోజే రిజెక్ట్ చేసారు. ఆ సినిమాలో ఏమి లేదు ఇక దీనికి సీక్వెల్ కూడానా అంటూ పెదవి విరిచారు. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ లో అనసూయ అంతలా హైప్ క్రియేట్ చేసినా అందులో విసమంత నిజం కూడా లేదు, అనసూయ ఎందుకిలా చెప్పిందో అని చాలామంది అనుకున్నారు.
తాజాగా అనసూయ పెద్దకాపు 1 ప్లాప్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. పెద్దకాపు 1 అనేది పూర్తిగా శ్రీకాంత్ అడ్డాల సినిమా. కొన్ని ఉంటాయి అవి మన ఊహకి కూడా అందవు. అలాంటి మూమెంట్స్ కొన్ని పెద్దకాపు 1లో నాకు ఎదురయ్యాయి. దర్శకుడు ముందు మనమెంత, ఆయన విజన్ నాకు అర్ధం కాలేదేమో.. నాలాగే చాలామంది కి, ఆడియెన్స్ కి కూడా ఈ సినిమా అర్ధం కాలేదనిపించింది. కానీ ఈ సినిమాని ఇష్టపడేవాళ్లు లేకపోలేదు, శ్రీకాంత్ అడ్డాల అనుకున్నది సాధించారనుకుంటున్నాను అంటూ అనసూయ పెద్దకాపు 1 పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
అంతేకాకుండా అనసూయ పెద్దకాపు 1 లో తన పాత్ర తాలూకు కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ లో లేపేసారనే విషయం రివీల్ చేసింది. కథకి కనెక్ట్ అయ్యే కొన్ని సీన్స్ కట్ అయ్యాయనే ఫీలింగ్ నాకూ వచ్చింది. అది నా తప్పుకాదు, అలా కట్ చెయ్యడమూ తప్పు కాదు. ఈ విషయంలో దర్శకుడితో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. అయినా మీరు చూసింది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 చూస్తే క్లారిటీ వస్తుంది అంటూ అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.