పుష్ప ద రైజ్ లో సాంగ్స్ తోనే ఊపేసిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని చూస్తుంది. యానిమల్ మూవీతో ప్యాన్ ఇండియా హిట్ కొట్టాలని కసితో ఉంది. ఇప్పటివరకు యానిమల్ నుంచి విడుదలైన టీజర్స్ సాంగ్స్ అలాగే రణబీర్ కపూర్-రష్మిక స్టిల్స్ అన్ని సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాల్లో నటించినా రశ్మికకి ఇంకా సక్సెస్ అనేది దరి చేరలేదు. అందుకే ఈ యానిమల్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తుంది.
ప్రస్తుతం తెలుగులో పుష్ప ద రూల్ మూవీతో పాటుగా తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఓ రెయిన్ బో మూవీ చేస్తున్న రశ్మికకి నితిన్ మూవీలో ఛాన్స్ వచ్చింది. కానీ ఆమె తమిళ ప్రాజెక్ట్స్ తో బిజీ అవడంతో నితిన్ మూవీ నుంచి తప్పుకుంది. అక్కడ తమిళనాట హీరో ధనుష్ తో జోడి కడుతుంది. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ధనుష్ చేస్తున్న భారీ మల్టీస్టారర్ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజాగా రష్మిక ఓ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చిట్టిపొట్టి ఫ్రాక్ లో రష్మిక జిగేల్ మనిపిస్తుంది.
Me ft twinkling stars ✨✨ అంటూ బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోతూ దర్శనమిచ్చింది. ప్రస్తుతం రష్మిక న్యూ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.