బోయపాటి-రామ్ పోతినేని కాంబోలో ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన స్కంద మూవీ సెప్టెంబర్ 28 న విడుదలైంది. లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకుందామనుకున్న స్కంద కి ఆడియన్స్ బిగ్ షాకిచ్చారు. రామ్ కెరీర్ లో స్కంద ప్లాప్ మూవీగా మిగిలిపోయింది. రామ్-శ్రీలీల జంటగా బోయపాటి తెరకెక్కించిన స్కంద మూవీ లో వయలెన్స్ ఎక్కువైన కారణంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. స్కంద తో బయ్యర్లకి భారీగా కాకపోయినా కొంతమేర నష్టపోయారు.
ఇలాంటి ప్లాప్ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది. నిన్న శుక్రవారం నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్కంద మూవీ స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ప్లాప్ సినిమా అయినా ఓటిటి ఆడియన్స్ ని అట్రాక్ చెయ్యాలంటే ఎంతోకొంత ప్రమోషన్ కావాలి. ఇప్పుడు డిస్ని ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు అదే చేస్తున్నారు. స్కంద ఓటిటి రిలీజ్ పై ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. అది చూసిన నెటిజెన్స్ ప్లాప్ సినిమాకి ఓటిటి హడావిడి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.