బిగ్ బాస్ సీజన్ 7 లో ఫిజికల్ గా కన్నా మైండ్ గేమ్ ఆడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారిన శివాజీ పై హౌస్ లో కొంతమందికి వీరాభిమానం ఉంటే.. కొంతమందిలో సదాభిప్రాయం లేదు. శివాజీ కన్నింగ్ గేమ్ ఆడుతూ అమరదీప్, శోభా శెట్టి, ప్రియాంక, గౌతమ్ లాంటివాళ్లను హౌస్ నుంచి పంపించాలని చూస్తున్నాడు, దాని కోసమే పల్లవి ప్రశాంత్, యావర్ మధ్య మధ్యలో తేజని దువ్వుతూ సపోర్ట్ తీసుకుంటున్నాడు అంటూ మరికొంతమంది ఆరోపిస్తున్నారు. ఇక గౌతమ్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి వచ్చాక శివాజీ పై పర్సనల్ గా పగ పెట్టుకున్నాడు. అది పోగొట్టడానికి శివాజీ తెలివిగా గౌతమ్ కి కెప్టెన్సీ ఛాన్స్ ఇచ్చినట్టుగా కలరింగ్ ఇచ్చాడు.
తాజాగా ఈరోజు ఎపిసోడ్ లో శివాజీకి గౌతమ్ కి గొడవ జరిగిన ప్రోమో రిలీజ్ చేసారు. గౌతమ్ దగ్గర బ్లాక్ బాల్ ఉన్న కారణంగా ఎల్లో టీమ్ నుంచి అన్ని బాల్స్ గౌతమ్ బాల్స్ తో స్వాప్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. దానితో ఎల్లో టీమ్ వాళ్ళు ఈ టాస్క్ బాలేదు అని మాట్లాడుకుంటున్నారు. మధ్యలో గోల్డెన్ బాల్ అడ్వాంటేజ్, అన్ని అడ్వాంటేజ్ లు వాళ్లకేనా బిగ్ బాస్ అంటూ శివాజీ మాట్లాడాడు. ఆ తర్వాత గౌతమ్ శివాజీ మధ్యలో గొడవ మొదలయ్యింది. మీరే ఆడుకోండి అంటూ గౌతమ్ వెళ్ళిపోయాడు. ప్రియాంక, శివాజిలు మాట్లాడిన గౌతమ్ వినలేదు.
నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రతి సారి చెయ్యాలంటే చేయలేము అన్నాడు శివాజీ, మా ఇష్టం ఏంటన్నా బిగ్ బాస్ చెప్పాడు అంటూ గౌతమ్ అన్నాడు. నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు చాలా సైలెంట్ గా ఉంటావు .. నీకు అనుకూలంగా లేకపోతే వైలెంట్ గా అవుతావు అంటూ గౌతమ్ ని రెచ్చగొట్టాడు శివాజీ, నేనేం తప్పు చేసానో చెప్పమన్నాడు గౌతమ్. నీతో నేను మాట్లాడలేను అన్నాడు శివాజీ. వాంటెడ్ వాదన పెట్టుకుంటున్నావ్ అన్నాడు శివాజీ.. నాకవసరం లేదు అన్నా వాంటెడ్ వాదన అన్నాడు గౌతమ్.. చాలాసేపు వారి మధ్యలో వాదన జరిగినట్టుగా ప్రోమో చూపించారు.