కొణిదెల బ్రదర్స్, మెగా బ్రదర్స్ ఎప్పుడు కలిసి కనిపించినా మెగా అభిమానులకే కాదు.. చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అభిమానులకైతే కన్నుల పండుగే. మెగా స్టార్ బర్త్ డే అయినా.. మారేదన్నా మెగా ఫ్యామిలి ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కనిపించారంటే చాలు అభిమానులకి పూనకాలే. రీసెంట్ గా జరిగిన వరుణ్ తేజ్ పెళ్ళిలో పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా.. నిన్న గురువారం రామ్ చరణ్-పవన్ కళ్యాణ్ కలిసి నడుస్తున్న పిక్ చూసి మెగా ఫాన్స్ మురిసిపోయారు.
ఇక ఈరోజు మెగా బ్రదర్ నాగబాబు.. మెగాస్టార్ చిరు-పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా మధ్య ఎన్ని వాదనలు వచ్చినా, ఎన్ని విబేధాలు వచ్చినా మా బంధం మాత్రం ఎప్పిటికీ ఇలాగే ఉంటుందని, అలాగే మేము చేసిన పనులు, మా జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా మధ్య ఏర్పడే విభేదాల కంటే మా అనుబంధం మరింత ముఖ్యమైనదని అంటూ రాసిన పోస్ట్ వైరల్ గా మారింది.
అంతేకాకుండా తమ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ బంధం నిజంగా విలువైనది మాత్రమే కాదు బలమైనదిగా తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ బంధం ఎప్పటికీ విడదీయలేనిదిగా ఉంటుందని ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు ఆయన.