వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వివాహం ఇటలీ లోని టుస్కనీ నగరం వేదికగా నవంబర్ 1 న అంగరంగ వైభవంగా జరిగింది. వరుణ్ తేజ్ తో స్నేహం చేసి తర్వాత ప్రేమలో పడి లావణ్య త్రిపాఠి ఫైనల్ గా పెళ్లి పీటలెక్కింది. లావణ్య త్రిపాఠి ఎప్పటినుంచో అంటే నిహారిక పెళ్లి అప్పుడే మెగా ఫ్యామిలిలో ఎక్కువగా కనిపించింది. నిహారిక పెళ్లి వేడుకలు ప్రతిదానిలో పార్టిసిపేట్ చేసింది. అప్పుడే వరుణ్ తేజ్ ప్రేమ వయ్వహారంపై పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి.
అయితే అన్న ఎంగేజ్మెంట్ సమయానికి భర్త చైతన్య తో విడిపోయి ఒంటరిగా మారిన నిహారిక అన్న నిశ్చితార్థంలో సింగిల్ గానే ఈసందడి చేసింది. ఇక పెళ్లిలోను నిహారిక అక్కలతో కలిసి హంగామా చెయ్యడమే కాదు.. పెళ్లి తర్వాత అన్న వరుణ్ తేజ్-వదిన లావణ్య త్రిపాఠీలతో కలిసి ఫోటో దిగి.. ఆ బ్యూటిఫుల్ పిక్ తో పాటుగా వదినమ్మ వచ్చేసింది అంటూ లావణ్య త్రిపాఠికి తన ఫ్యామిలీలోకి వెల్ కమ్ చెబుతూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
స్నేహితురాలిగా ఆ తర్వాత వదినమ్మగా లావణ్య త్రిపాఠి నిహారిక లైఫ్ లోకి వచ్చేసింది. అదే విషయాన్ని నిహారిక తన పోస్ట్ లో చెప్పుకొచ్చింది. మరి అన్న-వదినలతో నిహారిక దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది