అనుష్క బర్త్ డే కి ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. కానీ అనుష్క శెట్టి హాష్ టాగ్ తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణమెవరో కాదు ప్రభాస్ ఫాన్స్. ప్రభాస్-అనుష్కలు కలిసి పలు సినిమాల్లో నటించడంతో వారి మధ్యన స్నేహం ఏర్పడింది. ఆ స్నేహాన్ని కొంతమంది ప్రేమగా అపార్ధం చేసుకోవడంతో ప్రభాస్-అనుష్క ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ ఎప్పటినుంచో ప్రచారంలోకి వచ్చింది. అందుకే ప్రభాస్-అనుష్క ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని అంటూ ఉంటారు.
కానీ మేమిద్దరం మంచి స్నేహితులమని చెబుతూ పెళ్లి వార్తలని అనుష్క, ప్రభాస్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటారు. ప్రభాస్ పెళ్లిపై ఏ వార్త వచ్చినా అది అనుష్కతో ముడిపడి ఉంటుంది. ప్రభాస్ ఫాన్స్ మాత్రం అనుష్కని ప్రభాస్ వివాహం చేసుకుంటే బావుంటుంది అని ఆశపడుతూవుంటారు. అందుకే వారు అనుష్కని కూడా అభిమానిస్తారు. అనుష్క శెట్టి పుట్టిన రోజుకి ఇంకా నాలుగు రోజుల సమయం ఉండగానే ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవడానికి కారణం ప్రభాస్ ఫాన్స్.
ప్రభాస్ ఫాన్స్ పనిగట్టుకుని అనుష్క శెట్టి హాష్ టాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తునాన్రు. ఆమెకి బర్త్ డే విషెస్ చెప్పడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మరి ప్రభాస్ ఫాన్స్ తలచుకుంటే ఏమైనా జరుగుతుంది అనేలా అనుష్క హాష్ టాగ్ ట్విట్టర్ లో ప్రతి రోజు ట్రెండింగ్ లోకి వస్తుంది. అందుకే అనేది ప్రభాస్ ఫాన్స్ మామూలోళ్లు కాదు అని.