ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ విడుదలకి సమయం దగ్గరకొచ్చేస్తున్న కొద్దీ ప్రభాస్ ఫాన్స్ లో ఆందోళ పెరిగిపోతుంది. ఆందోళనకి ప్రత్యేకంగా కారణాలేమీ లేవు. సలార్ ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టలేదు. ప్రభాస్ బర్త్ డే కి సలార్ ట్రైలర్ వస్తుంది అనుకుంటే.. హ్యాండ్ ఇచ్చారు. జస్ట్ పోస్టర్ తో సరిపెట్టారు. ఇంత పెద్ద సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యాలంటే ప్రమోషన్స్ అవసరం ఉంది. కానీ మేకర్స్ కామ్ గా ఉన్నారు. అందుకే అభిమానుల్లో కంగారు.
ఇక సలార్ రెండు భాగాలుగా విడుదల కాబోతుంది అంటూ ప్రశాంత్ నీల్ ఎప్పుడో అనౌన్స్ చేసారు. ఈ ఏడాది డిసెంబర్ 22 న ఒక భాగం, తర్వాత భాగం ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా ప్రకటించలేదు. సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సిన సలార్ కొన్ని కారణాల వలన డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఈ మద్యలో ప్రభాస్ లేని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ దర్శకుడి చేపట్టారు, సిజి వర్క్ పై ఉన్న అనుమానంతో సినిమా పోస్ట్ పోన్ చేసారని అన్నారు. కానీ ఇప్పుడు మరో అనుమానాన్ని రేకెత్తించారు.
అది సలార్ రెండో భాగం ఉండదా.. రెండో భాగానికి ఉంచిన కొన్ని సీన్స్ ని మొదటి భాగంలోనే కలిపేశారు, అంతేకాకుండా ఐటెం సాంగ్ కూడా మొదటి భాగంలోనే పెట్టారు.. ఇక రెండో భాగం అవసరం ఉండకపోవచ్చు అంటూ అనుమానాలు రేకెత్తించేలా కొన్ని ట్వీట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరి ఈ సందేహాలన్నీ సినిమా విడుదలయ్యాకే తీరుతాయేమో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.