మహిళలకు 40 ఏళ్ళు వస్తున్నాయంటే.. సంసార బాధ్యతలతో కొట్టుమిట్టాడుతారు. పిల్లల స్కూల్స్, భర్త ఆఫీస్, ఇంకా ఉద్యోగం అంటూ పరుగులు పెడుతూ తమ ఆరోగ్యాలని లెక్కచెయ్యకుండా.. అనేక అనారోగ్యాల బారిన పడడమే కాదు.. తమ శరీరంలోనూ అనేక మార్పులు చోటుచేసుకుని బొద్దుగా అవడమో.. లేదంటే మారేదన్నానో అన్నట్టుగా మారిపోతూ ఉంటారు. కానీ హీరోయిన్స్ అలా కాదు..ఏజ్ అయిపోతున్నా పెళ్లి పేరు ఎత్తరు. సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తూ అందం కోసం, గ్లామర్ కోసం జిమ్ లో వర్కౌట్ హెల్దీ ఫుడ్స్ అంటూ మైంటైన్ చేస్తారు.
అందుకే వారికి 40 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా అందంగా, గ్లామర్ గా కనబడతారు. కోలీవుడ్ హీరోయిన్ త్రిషకి 40 ఏళ్ళు. ఆమెకి వయసు తగ్గుతుందో.. పెరుగుతుందో అర్ధం కానట్టుగా ఆమె లుక్స్ ఉంటున్నాయి. పొన్నియన్ సెల్వన్ తో లైమ్ టైమ్ లోకి వచ్చిన త్రిష ఇప్పుడు తన లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లోనే కాదు.. మొన్న వచ్చిన లియో లోను త్రిష ఎంత చక్కగా బ్యూటిఫుల్ గా కనిపించిందో. క్యూట్ గా, స్వీట్ గా, ఆకర్షణగా కనిపిస్తోంది.
తాజాగా లియో సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న త్రిష రెడ్ శారీ లో అదరగొట్టేసింది. ఆ అందం చూస్తే ఏంటి త్రిష వయసు పెరుగుతుందా.. తగ్గుతుందా.. ఇంత అందాన్ని ఎలా మైంటైన్ చేస్తున్నావ్ అంటూ అడుగుతున్నారు. నిజంగా త్రిష ఆ రెడ్ శారీ లో లుక్స్ విషయంలో యూత్ ని కట్టి పడేసింది. ఈ ఏజ్ లోను త్రిష ఇంత బ్యూటిఫుల్ గా కనిపించడం చూసి ఆమెని అందరూ తెగ పొగిడేస్తున్నారు.