కొద్దిరోజుల క్రితం కన్నప్ప షూటింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన మంచు విష్ణు అక్కడ షూటింగ్ స్పాట్ లో డ్రోన్ తగిలి గాయాల పాలైన విషయం తెలిసిందే. విష్ణు చేతికి బలంగా డ్రోన్ తాకడంతో గాయపడిన మంచు విష్ణు కన్నప్ప షూటింగ్ ఆపేసాడు. ఆ తర్వాత విష్ణు హెల్త్ పై ఎలాంటి న్యూస్ బయటికి రాలేదు. దానితో మంచు అభిమానులు కాస్త ఆందోళనపడుతున్నారు. తాజాగా మంచు విష్ణు హెల్త్ కండిషన్ పై మంచు మోహన్ బాబు అప్ డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం మంచు విష్ణు కోలుకుంటున్నాడు, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే అందరి ముందుకు వస్తాడు, విష్ణు త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేసిన అందరికి కృతఙ్ఞతలు. న్యూజిలాండ్ లో కన్నప్ప షూటింగ్ లో విష్ణు గాయపడ్డాడు. దేవుడి దయవల్ల విష్ణు ప్రస్తుతం కొలుకుంటున్నాడు. అతి త్వరలోనే కన్నప్ప షూటింగ్ సెట్స్ పైకి వస్తాడు అంటూ మోహన్ బాబు విష్ణు హెల్త్ పై ఇచ్చిన అప్డేట్ తో మంచు అభిమానులు కూల్ అయ్యారు.
తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా మంచు విష్ణు కన్నప్ప ప్రాజెక్ట్ ని అనౌన్స్ చెయ్యడమే కాదు.. ఈ చిత్ర షూటింగ్ ఆల్మోస్ట్ న్యూజిలాండ్ లోనే జరగబోతున్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత ఈప్రాజెక్టు లోకి ప్యాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లని తీసుకువచ్చి ఈప్రాజెక్టు ఎంత క్రేజీగా తెరకెక్కుతుందో చూపించాడు.