ఈరోజు నవంబర్ 1 బుధవారం సాయంత్రం మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి లు పెళ్లి తో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కనీ నగరంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల రాయల్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఐదేళ్ల స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని నేడు పెళ్లితో వరుణ్ తేజ్-లావణ్యలు దంపతులుగా మారారు.
గత రెండు రోజులుగా ఇటలీలో మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫామిలీస్ పెళ్లి వేడుకల్లో సందడి చేసాయి. కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిపాటి ఫ్రెండ్స్(నితిన్ ఆయన భార్య, నీరజ కోన) మధ్యన లావణ్య-వరుణ్ వివాహం గ్రాండ్ గా జరగగా.. కొడుకు-కోడలు.. వరుణ్ తేజ్-లావణ్య ల పెళ్లి ఫోటోని నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేసారు.