మలయాళ పరిశ్రమ అనే కాదు ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా.. కొంతమంది నటులు అనుకోకుండా గుండెపోటు( కార్డియా అరెస్ట్ తో) కన్ను ముయ్యడమనేది ఈమధ్యన తరచూ చూస్తున్నాము, వింటున్నాము. కన్నడలో పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ లో సిద్దార్థ్ ఇలా చాలామంది నటులు కార్డియా అరెస్ట్ తోనే కన్నుమూయడం వాళ్ళ కుటుంభ సభ్యులతో పాటుగా అభిమానులని విషాదంలోకి నెట్టింది.
ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో మరో ఘోరం జరిగింది. మలయాళంలో బుల్లితెర కి ఫేమస్ అయిన ప్రియా అనే నటి కార్దియా అరెస్ట్ తో కన్నుమూయడం అందరిని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ప్రియా డాక్టర్ కూడా అవడం మరింత విషాదాన్ని కలిగించింది. ప్రియా ఎనిమిది నెలల ప్రెగ్నెంట్. ఆమె ప్రెగ్నెంట్ చెకప్ లో భాగంగా ఆసుపత్రికి రాగా.. ఆమెకి సడన్ గా గుండెపోటు రావడంతో డాక్టర్స్ ఆమెకి చికిత్స అందించినా ఆమెని కాపాడలేకపోయారు.
అయితే డాక్టర్స్ వెంటనే ఆపరేషన్ చేసి ఆమె గర్భంలో ఉన్న శిశువుని బయటికి తీసి ఆ శిశువుకి ICU లో చికిత్స అందిస్తున్నారు. ప్రియని కాపాడదామని డాక్టర్స్ ఎంతగా ప్రయత్నం చేసినా ఆమెని మాత్రం కాపాడలేకపోయినట్లుగా తెలుస్తుంది. ప్రియా వయసు 35 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో ఆమె అలా కన్నుమూయడంతో ఆమె సహా నటుడు కిషోర్ ఈ వార్తని సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.