కోలీవుడ్ స్టార్ విజయ్-టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ల కలయికలో భారీ అంచనాల నడుమ అక్టోబర్ 19 న ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన లియో మూవీ తమిళనాట హిట్ అయినా.. మిగతా అన్ని భాషల్లో సో సో టాక్ తెచ్చుకుంది. యావరేజ్ టాక్ తోనే 500 కోట్లు కొల్లగొట్టిన లియో మూవీకి సక్సెస్ మీట్ ని చెన్నైలో ఈరోజు భారీగా నిర్వహిస్తున్నారు. లియో విడుదలకు ముందు ఆడియో లాంచ్ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు చేసాక.. తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వని కారణంగా లియో వేడుకని అప్పట్లో క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా హిట్ అవడంతో లియో సక్సెస్ సెలెబ్రెటీన్స్ కోసం అభిమానులు పట్టుబట్టడంతో మేకర్స్ లో సక్సెస్ ఈవెంట్ ని చెన్నై లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు. అయితే లియో విడుదలకు ముందు నుంచే విజయ్ యాంటీ ఫాన్స్ #LeoDisaster హాష్ టాగ్ తో సోషల్ మీడియాని ఊపేస్తున్నారు. సినిమా విడుదలయ్యాక #LeoSuperhit హాష్ టాగ్ తో పాటుగా కొద్ది రోజుల పాటు #LeoDisaster హాష్ టాగ్స్ ట్విట్టర్ లో కనిపించాయి.
ఇప్పుడు చెన్నైలో లియో సక్సెస్ ఈవెంట్ జరుగుతున్న సమయంలోనూ #LeoDisasterMee, #LeoSuccessMeet హాష్ టాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం చూసిన నెటిజెన్స్.. విజయ్ లియో పై ఆయన అభిమానులకి ఏ మాత్రం అభిమానం తగ్గలేదు. అదే రేంజ్ లో విజయ్ పై లియో పై ఆయన యాంటీ ఫాన్స్ కి కోపం కూడా తగ్గలేదు అందుకే ఇలాంటి హాష్ టాగ్స్ కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.