మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న గుంటూరు కారం ఘాటు సోషల్ మీడియాలో బాగా హైలెట్ అవుతుంది. గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ కోసం మహేష్ అభిమానులేమో కానీ.. మీడియా కూడా మినీ యుద్ధమే చేస్తుంది. సోషల్ మీడియాలో గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ పై వస్తున్న వార్తలతో మహేష్ అభిమానులు ఎగ్జైట్ అవుతున్నా.. ఆ ఫస్ట్ సింగిల్ రాక పదే పదే పోస్ట్ పోన్ అవడం కూడా వాళ్ళని బాగా డిస్పాయింట్ చేస్తుంది.
తాజాగా నాగవంశీ గుంటూరు కారం గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. సంక్రాంతి కి గుంటూరు కారం మాత్రమే కాకుండా చాలా సినిమా వస్తున్నా తనపై ఎలాంటి ఒత్తిడి లేదు, మీ సినిమా పోస్ట్ పోన్ చేసుకోమని, అడ్జెస్ట్ కమ్మని ఏ నిర్మాత దగ్గరికైనా వెళ్లొచ్చు కదా అని అడిగితే వాళ్ళే నా దగ్గరకి రావాలి, మనమెందుకు అంటూ నాగ వంశీ సమాధానముంది. గుంటూరు కారం ఫస్ట్ ఆడియో సింగల్ కూడా నవంబర్ మొదటి వారం అన్నారు.. ఆల్రెడీ నవంబర్ ఫస్ట్ వీక్ మొదలైపోయింది. మరి మిగిలిన ఈ ఆరు రోజుల్లో నిజంగా విడుదల చేస్తారా అనేది అనుమానంగానే ఉంది అని అడిగితే..
దానికి నాగవంశీ స్పందిస్తూ అన్నీ మీరే అంటున్నారు. అటు ఫస్ట్ సునీల్ పై పెరుగుతున్న హైప్ తో ఆ సింగిల్ కి సంబందించిన మ్యూజిక్ ని పదే పదే చూసుకుంటున్నారు. అలాగే క్రేజ్ ఉన్న పాటలు పోస్ట్ పోన్ అయినా ఫలితం పాజిటివ్ గా వస్తుంది. సంక్రాంతికి ముందే నేను నాలుగైదు పాటలు విడుదల చెయ్యాలి. ఈ వారంలో ఖచ్చితంగా గుంటూరు కారం నుంచి అప్ డేట్ వస్తుంది. ఫస్ట్ సింగిల్ ఉంటుంది అంటూ నాగవంశీ ఘాటుగా అప్ డేట్ ఇచ్చాడు.