జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చూపించే గ్లామర్ కి యూత్ కి దిమ్మతిరిగిపోతుంది. గుండెజారి గల్లంతయ్యిందే అంటూ జాన్వీ అందాలని చూసి సాంగ్ ఏసుకుంటారు. అయితే ఇప్పటివరకు జాన్వీ కపూర్ కి వెండితెర మీద గ్లామర్ షో చేసే ఛాన్స్ రాలేదు. ఆమె నటించిన చిత్రాల్లో జాన్వీ సింపుల్ గానే కనిపించింది. ఇప్పుడు సౌత్ ప్యాన్ ఇండియా ఫిలిం దేవర లోను జాన్వీ కపూర్ లంగా వోణిలో తంగం గా చాలా సింపుల్ గా క్యాజువల్ గా కనిపించింది.
నిన్న మంగళవారం దేవర నుంచి జాన్వీ కపూర్ లుక్ రివీల్ చేసారు. ఈ లుక్ లో చాలా అంటే చాలా ట్రెడిషనల్ గా తంగం కేరెక్టర్ లో జాన్వీ కపూర్ లుక్ చూసి.. ఔరా జాన్వీ కపూర్ లో ఎంత తేడా అంటూ నోళ్లు నొక్కుకుంటున్నారు. ఎప్పుడూ గ్లామర్ డ్రెస్సులు వేసి అందాలని చూపించే జాన్వీ కపూర్ ఇప్పుడు దేవర లుక్ లో చక్కగా పదహారణాల తెలుగమ్మాయి మాదిరిగా కనిపించింది.
అది నిన్న ఈరోజు బుధవారం జాన్వీ కపూర్ తన రొటీన్ లుక్ లో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిన్న లంగాఓణిలో చక్కగా కనిపించిన జాన్వీ ఈ రోజు గ్లామర్ గా కనిపించింది. ఒక్క రోజులో జాన్వీ కపూర్ లో ఎంత వేరియేషన్ బాసు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.