Advertisementt

కళ్యాణ్ రామ్-వైష్ణవ్ తేజ్ ఒకే దారిలో

Wed 01st Nov 2023 01:58 PM
kalyan ram  కళ్యాణ్ రామ్-వైష్ణవ్ తేజ్ ఒకే దారిలో
Kalyan Ram-Vaishnav Tej on the same path కళ్యాణ్ రామ్-వైష్ణవ్ తేజ్ ఒకే దారిలో
Advertisement
Ads by CJ

ఈరోజు ఇద్దరు హీరోలు తమ సినిమాలని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా  ప్రకటించారు. అందులో కళ్యాణ్ రామ్ తన లేటెస్ట్ మూవీ డెవిల్ ని నవంబర్ 24 కి విడుదల చెయ్యడం లేదు అంటూ ప్రకటించాడు. డెవిల్ మూవీ ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. అయితే నవంబర్ 24 విడుదల అని ఎప్పుడో ప్రకటించిన ఈచిత్రానికి దర్శకుడు విషయంలో చాలా ప్రచారం జరిగింది. ఆ విషయం పక్కనబెడితే ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆర్ ఆర్ పూర్తి కాకపోవడంతో డెవిల్ మూవీని పోస్ట్ పోన్ చేశారట మేకర్స్.

ఇదే రోజుమరో యంగ్ హీరో తన సినిమాని వాయిదా వేసుకున్నాడు. అదే మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ. ఆదికేశవ ఆగష్టు 25 విడుదల అని ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత నవంబర్ 10 కి డేట్ షిఫ్ట్ చేసారు. అందుకు తగినట్టుగా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆదికేశవని నవంబర్ 10 నుంచి నవంబర్ 24 కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కొన్ని కారణాల వలన ఆదికేశవ రెండు వారాల తర్వాత విడుదల కాబోతుంది.

అటు కళ్యాణ్ రామ్ డెవిల్ ని పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పినా.. ఇంకా కొత్త డేట్ ఇవ్వలేదు. కానీ వైష్ణవ్ తేజ్ ఆదికేశవని రెండు వారాల పాటు పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా కొత్త డేట్ ఇచ్చి పోస్టర్ వేసి మరీ ప్రకటించారు.

Kalyan Ram-Vaishnav Tej on the same path:

Kalyan Ram Devil and Vaishnav Tej Adikeshava postponed 

Tags:   KALYAN RAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ