ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమా నుంచి మాత్రమే కాదు.. చిన్న సినిమాల నుంచి ఏదైనా ఫస్ట్ లుక్, టీజర్, సింగిల్, ట్రైలర్ ఇలా ఏ ప్రకటన రావాలన్నా దానికి ముందు నుంచే అంటే ఓ వారంపదిరోజుల ముందునుంచే సోషల్ మీడియాలో మేకర్స్ చేసే హడావిడికి అభిమానులకి పూనకలొచ్చేస్తాయి. ఆ అప్డేట్ పై హైప్ క్రియేట్ చేసేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. మరి అంతలాంటి హైప్ ఉండాల్సిన అప్ డేట్ ని సింపుల్ గా వదిలితే అందులో కిక్ ఏముంటుంది.
ఇప్పుడు అదే జరిగింది. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ పూర్తి చేసుకుంటున్న దేవరా మూవీ నుంచి నిన్న మంగళవారం సాయంత్రం జాన్వీ కపూర్ లుక్ వదిలారు. ఎలాంటి హడావిడి లేదు, ఎటువంటి హంగామా లేదు. ఉన్నట్టుండి జాన్వీ కపూర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం చూసి ఓపెన్ చేస్తే అందులో దేవరాలో తంగం గా జాన్వీ కపూర్ లుక్ అంటూ దర్శనమివ్వడం చూసి ఎన్టీఆర్ అభిమానులకి ఆనందపడాలో.. ఎలాంటి హడావిడి లేకుండా ఇంత సైలెంట్ గా జాన్వీ లుక్ వదలడంపై ఆగ్రహం తెచ్చుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు.
ఎన్టీఆర్ ఫాన్స్ మత్రమే కాదు.. సాధారరణ ప్రేక్షకుడు కూడా ఇదేమిటి దేవరా నుంచి జాన్వీ కపూర్ లుక్ ఇంత సైలెంట్ గా వదిలారు అని మట్లాడుకున్నారు. ఇలాంటి అప్ డేట్ వస్తే ఎంత హడావిడి, ఎంత హంగామా ఉండాలి. ఇలా కామ్ గా ఉన్నట్టుండి జాన్వీ లుక్ ని ఎందుకు వదిలారో.. అది టీమ్ కే తెలియాలి. జాన్వీ కపూర్ దేవరలో తంగం కేరెక్టర్ లో చాలా సింపుల్ గా కనిపించింది. మా దేవరకి పర్ఫెక్ట్ జోడి జాన్వీ కపూర్ అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ అయితే దేవర హాష్ టాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.