బిగ్ బాస్ సీజన్ 7 లోకి టైటిల్ ఫేవరెట్ గా దిగిన అమరదీప్ మొదట్లో కాస్త యాక్టీవ్ గానే కనిపించాడు. ఆ తర్వాత అమరదీప్ టాస్క్ పరంగా కానీ, మాటల పరంగా కానీ ఏ విధంగానూ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోతున్నాడు. సీరియల్ బ్యాచ్ లా ముద్ర వేయించుకున్న అమరదీప్, శోభా శేట్టి, ప్రియాంక వీళ్ళొక గ్రూప్. ఇక అమరదీప్ టాస్క్ ల్లో ఫౌల్ గేమ్ ఆడడమే కాదు.. నామినేషన్స్ లోను నిబ్బా నిబ్బా నామినేషన్స్ తో చిరాకు తెప్పిస్తున్నాడు.
అతని బిహేవియర్ చూసిన వాళ్లకు, నామినేషన్స్ లో అమరదీప్ యాటిట్యూడ్ చూసిన వాళ్లంతా ముందు ఆ అమరదీప్ గాడిని బయటికి పంపించండ్రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో మొదటి వారం నుంచే విభేదిస్తున్నాడు. అలాగే శివాజీ కి అమరదీప్ కి అస్సలు పడడం లేదు. ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా భోలే పై అమరదీప్ యుద్ధం మొదలు పెట్టాడు.
గత రెండు రోజులుగా నామినేషన్స్ ప్రక్రియ పరిశీలిస్తే.. అమరదీప్ కి ఎక్కువగా ఓట్స్ పడ్డాయి. తన ఫ్రెండ్ అనుకున్న గౌతమ్, అర్జున్ కూడా అమరదీప్ ని ఫౌల్ గేమ్ ఆడావంటూ నామినేట్ చేశారు. టైటిల్ ఫేవరెట్ గా హౌస్ లోకి ఎంటర్ అయిన అమరదీప్ ఈ వారమో లేదంటే వచ్చే వారమో ఖచ్చితంగా ఎలిమినేట్ అవడం పక్కా. ఎందుకంటే బుల్లితెర ప్రేక్షకుల సహనానికి అంతగా అమరదీప్ పరీక్ష పెడుతున్నాడు.