Advertisementt

దేవరలో జాన్వీ కపూర్ లుక్

Tue 31st Oct 2023 09:24 PM
janhvi kapoor  దేవరలో జాన్వీ కపూర్ లుక్
Janhvi Kapoor looks in Devara దేవరలో జాన్వీ కపూర్ లుక్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మూవీ దేవర తో సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది అతిలోక సుందరి శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్. ఆమె టాలీవుడ్ ఎంట్రీ పై ఎన్ని వార్తలొచ్చినా.. ఆమె ఫైనల్ గా ఎన్టీఆర్ సినిమాతోనే ఎంట్రీకి సిద్ధమైంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ డీ గ్లామర్ రోల్ లో కనిపిస్తుంది అని దేవరలో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ తోనే కాం ఫర్మ్ చేసారు. ఇక జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు దేవర సెట్స్ లోకి జాయిన్ అవుతుందా.. ఎన్టీఆర్ తో ఎప్పుడు రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తుందో అనే అతృతతో శ్రీదేవి అభిమానులు, ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు.

తాజాగా దేవర కొత్త షెడ్యూల్ గోవాలో మొదలైంది. అక్కడ గోవా సముద్ర తీరంలో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ పై రొమాంటిక్ సీన్స్ చిత్రీకరణ చేపట్టారు కొరటాల శివ. ఆ సందర్భంగా జాన్వీ కపూర్ లుక్ ని విడుదల చేసారు మేకర్స్. దేవర చిత్రంలో జాన్వీ కపూర్ తంగం కేరెక్టర్ లో చాలా సింపుల్ గా లంగా వోణిలో జాలరి అమ్మాయిలా కనిపించింది. ఎప్పుడూ గ్లామర్ డ్రెస్సులతో కనిపించే జాన్వీ కపూర్ ఇలా సింపుల్ లుక్ లో కనిపించగానే కొంతమంది షాకయినా.. మరికొంతమందికి జాన్వీ కపూర్ ని చూడగానే శ్రీదేవి గుర్తుకు వచ్చింది అంటున్నారు.

ఇక ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న దేవర ఆ తర్వాత గోకర్ణకి షిఫ్ట్ కానుంది. అక్కడో చిన్నపాటి షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం వైజాగ్ వెళుతుంది. ఈ మూడు లొకేషన్స్ లోను జాన్వీ కపూర్-ఎన్టీఆర్ పైనే కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపడతారని  తెలుస్తోంది. 

Janhvi Kapoor looks in Devara:

Janhvi Kapoor As Thangam In Devara Movie

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ