నాగబాబు కుమార్తె నిహరిక చైతన్య జొన్నలగడ్డని రాజస్థాన్ వేదికగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. ఇక్కడ హైదేరాబద్ లోని నాగబాబు ఇంటి దగ్గరే పెళ్లి కూతురుగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు కుటుంభ సభ్యులు. అక్కడ రాజస్థాన్ జైపూర్ ప్యాలెస్ లో నిహారిక హల్దీ, మెహిందీ, సంగీత్ వేడుకలతో పాటుగా పెళ్లి ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా నిహారిక తన తల్లి పెళ్లి చీర కట్టుకుని మురిసిపోవడమే కాదు ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇప్పుడు అదే తీరులో మెగా ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెడుతున్న లావణ్య త్రిపాఠి కూడా తన పెళ్లి సంబరాల్లో భాగంగా అంటే హల్దీ వేడుక కోసం లావణ్య త్రిపాఠి తన తల్లి ధరించిన చీర కట్టుకోనుందని సమాచారం. తన తల్లి జ్ఞాపకంగా ఉంటుందని లావణ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మెగా డాటర్- మెగా కోడలు ఇద్దరికీ మదర్ సెంటిమెంట్ ఎంత ఉందో ఈ తల్లి చీరలతో తయారవడం చూస్తే తెలిసిపోతుంది. అయితే లావణ్య త్రిపాఠి తల్లి చీర కట్టుకుంటుందా, లేదా.. అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల మెహిందీ వేడుక రాజస్థాన్ మరికాసేపట్లో మొదలు కాబోతుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకి హల్దీ వేడుకలో వరుణ్-లావణ్య ల కుటుంభ సభ్యులు, ఇంకా నితిన్ ఇలా కొంతమంది ఫ్రెండ్స్ పాల్గొన్నారని తెలుస్తుంది.