అసలు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యని స్ట్రాంగ్ కంటెస్టెంట్ సందీప్ మాస్టర్ ఎనిమిదో వారం ఎలిమినేట్ అవడం హౌస్ మేట్స్ మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వగానే శోభా శెట్టి, అమరదీప్ లాంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చాక సందీప్ మాస్టర్ గీతూ రాయల్ తో BB బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. సందీప్ మీరు ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతారనుకున్నారా అని అడిగిన గీతుకి నేనేమి త్వరగా ఎలిమినేట్ అవ్వలేదు, 60 రోజులు హౌస్ లో ఉన్నాను, అది మాములు విషయం కాదు అన్నాడు.
ఆ తర్వాత హౌస్ లో తానేమి తప్పు చెయ్యలేదు, సంచాలక్ గా తాను ఏదైనా తప్పు చేసినా.. మిగతా వారు కూడా చాలా తప్పులు చేసారు. అవి కనబడలేదా అంటూ మాట్లాడిన సందీప్ మాస్టర్ హౌస్ మేట్స్ ముసుగు తీసే ప్రయత్నం చేసాడు. అందులో భాగంగా నేను హీరో అనుకుంటాడు కానీ ఆయన జీరో అంటూ భోలే బెలూన్ పగలగొట్టాడు సందీప్ మాస్టర్. ఆ తర్వాత రతిక కూడా అన్ని నాకే తెలుసు అనుకుంటుంది కానీ ఏమి తెలియదని ఆమె బెలూన్ పగలగొట్టారు. ఇక అర్జున్ తనకి తాను స్ట్రాంగ్ అనుకుంటాడు, కానీ తెలివి లేదు అన్నాడు.
పల్లవి ప్రశాంత్ ని, యావర్ ని తానే కెప్టెన్ చేశాననే అపోహలో శివన్న ఉన్నాడు, కానీ వాళ్ళు కష్టపడి ఆడితేనే కదా కెప్టెన్ అయ్యారు. కానీ శివాజీ అన్న తానే త్యాగాలు చేసి వాళ్ళని కెప్టెన్ ని చేశాను అని చెప్పుకుంటాడు అది నచ్చలేదు, శివన్న ఆ అపోహ నుంచి బయటికి రావాలి అంటూ శివాజీ గుట్టు రట్టు చేసాడు. తేజ ఆడకపోయినా.. బిగ్ బాస్ గురించి నాకు బాగా తెలుసు అనే భ్రమలో ఉంటాడంటూ అతని బెలూన్ పగలగొట్టాడు. ఇక అమరదీప్, శోభా శెట్టి, ప్రియాంకలతో పాటుగా ప్రశాంత్ కూడా మంచివాడంటూ వాళ్ళ బెలూన్స్ పగలగొట్టలేదు.