వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠీల పెళ్లి వేడుకలు ఇటలీ లోని టుస్కనీ నగరంలో అంగరంగ వైభవంగా మొదలైపోయాయి. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల కాక్ టైల్ పార్టీని కుటుంభ సభ్యులు సోమవారం రాత్రి నిర్వహించారు. చరణ్ ఫ్యామిలీ, మెగాస్టార్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫామిలీ ఇలా అందరూ ఈ పార్టీలో సందడి చేసారు. తాజాగా వరుణ్-లావణ్య ల వెడ్డింగ్ కార్డు బయటికి వచ్చింది. ఇక ఈ రోజు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల హల్దీ వేడుకలు ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నారు. సాయంత్రం మెహిందీ, సంగీత్ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
అయితే వరుణ్ తేజ్ - లావణ్యల వివాహం నవంబర్ 1 న జరగనుంది అని మాత్రమే తెలిసింది. ఆ ముహూర్త సమయం కూడా ఇప్పుడు రివీల్ అయ్యింది. నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 2:48కి పెళ్లి వరుణ్-లావణ్యల పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ముహూర్తాన వరుణ్.. లావణ్య మెడలో తాళి కట్టనున్నారు. అదేరోజు అంటే రేపు సాయంత్రం 8:30 గంటలకు రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబం, స్నేహితులు సహా దాదాపు 120 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకానున్నారు అని తెలుస్తుంది.