సందీప్ మాస్టర్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి టేస్టీ తేజనే కారణం. అతను వేసిన సిల్లీ నామినేషన్ అంటూ హౌస్ లోను, బయట కూడా అందరిని అనుమాన పెట్టింది. టెస్ట్ తేజ సిల్లీ నామినేషన్స్ తో హౌస్ మేట్స్ ని బయటికి పంపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో తేజని ట్రోలింగ్ చెయ్యడమే కాదు.. నిన్న సోమవారం రాత్రి శివాజి డైరెక్ట్ గా నువ్వు గనక సందీప్ ని నామినేట్ చెయ్యకపోతే స్ట్రాంగ్ ప్లేయర్ ఇంట్లో ఉండేవాడు. వాడు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళేవాడు కాదు.. అంటూ రీజన్ చెప్పి తేజని నామినేట్ చేసాడు.
అపుడే తేజ అందరికి బిగ్ షాక్ ఇచ్చాడు. సందీప్ మాస్టర్ నన్ను నామినేట్ చెయ్యమని అడిగాడు, అందుకే నామినేట్ చేశాను అనగానే చాలామంది షాకయ్యారు. హౌస్ మేట్స్ మాత్రమే కాదు.. బయట ఉన్నవారు కూడా సందీప్ తేజని నామినేట్ చెయ్యమన్నాడా అంటూ తెల్లబోయారు. ఎనిమిదివారాలుగా నామినేషన్స్ లో లేను.. ఇప్పుడు నామినేట్ చేస్తే నేనేమిటో జనాలకు తెలుస్తుంది అనుకున్నాడేమో సందీప్ తేజకి అలా చెప్పి నామినేట్ చేయించుకుని, అనుకోకుండా ఎలిమినేట్ అయ్యాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
లేదంటే అంత స్ట్రాంగ్ ప్లేయర్ ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు, అలాగే అతనికి ఓట్స్ పడలేదు అనేది కూడా ఫేక్ అంటూ సందీప్ అభిమానులు గోల చేస్తున్నారు. నిజంగానే టేస్టీ తేజ కి సందీప్ అలా చెప్పాడా అనే అనుమానమూ లేకపోలేదు. తన నామినేషన్ డిఫెండ్ చేసుకోవడానికి తేజ అలా కవర్ చేశాడా.. లేదంటే అదే నిజామా.. అనే కన్ఫ్యూజన్ లో మరికొంతమంది ఉన్నారు.