స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో గత 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దక్కింది. అనారోగ్య కారణాలతో 4 వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఏపీ హైకోర్టు ప్రకటించింది. న్యాయం గెలిచిందని టీడీపీ శ్రేణులు, వీరాభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఏం జరిగింది..!
కాగా.. బాబు అరెస్టయిన నటి నుంచి బెయిల్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్‌పై తీర్పుకు ఇంకా 9 రోజులున్నందున ఈలోగా మధ్యంతర బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించారు. మధ్యంతర, మెయిన్ బెయిల్ పిటీషన్లపై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మెయిన్ బెయిల్, మద్యంతర బెయిల్ పిటీషన్లపై హైకోర్టులో సోమవారం వాదనలు ముగియగా.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. మంగళవారం నాడు బెయిల్ పిటీషన్‌పై అందరూ అనుకున్నట్లే కీలక నిర్ణయం వెలువడినది.
బెయిల్ ఎందుకు..?
చంద్రబాబు కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించడం, ఇతర ఆరోగ్య సమస్యల్ని పరిగణలో తీసుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే పలు కోర్టులను చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరడం జరిగింది. హైకోర్టులో.. చంద్రబాబుకు జైలులో ప్రభుత్వ వైద్యులు ఇస్తున్న వైద్యం, వైద్యుల నివేదికను పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. ఆపరేషన్ ఇప్పటికిప్పుడు అవసరం లేదని వైద్యులు చెప్పిన విషయం గుర్తు చేశారు. ఆఖరికి హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ చంద్రబాబుకు మంజూరు చేసింది.
షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను హైకోర్ట్ ఇస్తూ... విధించిన షరతులు...❗
◻️ ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడదు...
◻️ కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు...
◻️ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది...
◻️ CBN తో ఇద్దరు DSPలు ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి..
◻️Z+ సెక్యూరిటీ విషయంలో... కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, CBN సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్య..