Advertisement
TDP Ads

టీడీపీకి బిగ్ షాక్

Mon 30th Oct 2023 09:42 PM
kasani gnaneshwar  టీడీపీకి బిగ్ షాక్
Big shock for TDP టీడీపీకి బిగ్ షాక్
Advertisement

తెలంగాణాలో నవంబర్ 30 న జరగబోయే ఎన్నికల్లో BRS, బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి. ఈ ఎలక్షన్స్ లో జనసేన, టీడీపీ కూడా పోటీ చేస్తాయని ఆ పార్టీ కార్యకర్తలు చాలా ఆశపడ్డారు. తెలంగాణ టీడీపీ నేతలైతే ఈ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చెయ్యాలనుకున్నారు.. కానీ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చెయ్యడం లేదు అని చెప్పడంతో చాలామంది నాయకులు డిస్పాయింట్ అయ్యారు, అవుతున్నారు. ఆ నిరాశలోనే వారు టీటీడీపీ కి బై బై చెప్పేస్తున్నారు.

తాజాగా తెలంగాణ టీడీపీ నేత కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేసారు. ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ.. చంద్ర బాబు గారి ఆహ్వానం మేరకు 11 నెలల క్రితం టీడీపీ లో జాయిన్ అయ్యాను, 17 పార్లమెంటు స్థానాల్లో మీటింగులు పెట్టి బలోపేతం చేశాం, మీరు ఛార్జ్ తీసుకున్నాక  పార్టీ అధ్యక్షుడిగా అన్ని బాధ్యతలు మీరే చుసుకోవాలన్నారు.. కానీ ఇప్పుడు చంద్ర బాబు తెలంగాణలో టీడీపీ పోటీ చెయ్యడం లేదని చెప్పారు, టీడీపీ తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, ఇన్నిరోజుల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.. అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. 

అంతేకాకుండా అధ్యక్షుడు చంద్రబాబుకి లేఖ రూపంలో తన భాదని వెళ్లగక్కారు.

శ్రీ నారా చంద్రబాబు నాయుడు..

టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు గారికి,

నమస్కారం ...

తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం అభినాయకత్వం నిర్ణయం తీసుకోవడం నాకు తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ఈ ప్రతికూల నిర్ణయం ఒక్క నాకే కాదు తెలంగాణ.వ్యాప్తంగా ఉన్న సమస్త పార్టీ శ్రేణులను సైతం మనోవేదనకు గురిచేస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటికి దిగి పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపి సర్వశక్తులు ఒద్దాల్సిన కీలకమైన సమయంలో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని మీరు తీసుకున్ననిర్ణయిం ఈ ప్రాంతంలో పార్టీ ఉనికిని మరోసారి ప్రశ్నార్థకం చేసేదిగా ఉంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్.-కాంగ్రెస్, బీజేపీలను పక్కనపడితే వామపక్షాలు, బీఎస్సీ, జనసేన, ఇతర చిన్నా చితక పార్టీలు సైతం ఎన్నికల బరిలో నిలిచి చట్టసభల్లో తమ ప్రాతినిధ్యం ఉండాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. 

40 ఏళ్లకు పైగా తెలుగు ప్రజల గుండెల్లో గూడు కాని సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండి తెలుగురాష్ట్రాల ప్రజల అభివృద్ధికి పాటుపడిన ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల్లో పోటికి దూరంగా ఉండాలన్న నిర్ణయం సహేతుకం కాదని భావిస్తున్నాను. 2014 తర్వాత తెలంగాణ వాదం బలపడి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, అప్పటి మన పార్టీ ముఖ్య నేతలంతా వలసబాట పట్టడం, జరిగింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెసతో పొత్తు పర్యవసానంగా 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 13 స్థానాల్లోని పోటీ చేయడం వల్ల అంతటా నాయకత్వం చెల్లాచెదురై పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. తదనంతరం పార్టీ

గుర్తుపై గిర్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఎల్. రమణతో పాటు చాలా మంది కీలక నేతలు పార్టీని వీడటం, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు కూడా ఇతర పార్టీలలో

చేరడంతో 2022 నాటికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందనేది వాస్తవం.

నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని ఏళ్ల తరబడి లెక్కచేయలేదు. కానీ... ఇవాళ తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న మీ నిర్ణయంతో బీసీలు, అణగారిన వర్గాలను మెజారిటీ స్థానాల్లో పోటీకి దింపాలన్న నా లక్ష్యం, ఆశయం నీరుగారిపోయాయి. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కష్టకాలంలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి సిద్ధమైన పార్టీ నేతలకు కూడా పార్టీ బీ ఫారం ఇవ్వలేకపోతే ఆ స్థానంలో నేనే ఉంటా. అది తగదనే నిర్ణయానికి వచ్చాను. అందుకే టీడీపీ అధిష్టానం నిర్ణయం అణగారిన వర్గాల నాయకత్వాన్ని నమ్ముకుని గొంతు నొక్కే విధంగా ఉందని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి లాభం చేకూర్చడం కోసం, తెలంగాణ ఎన్నికల్లో ఇతర పార్టీల గెలుపు కోసం పార్టీ క్యాడర్‌ను తాకట్టు పెట్టడం అనైతికం. అయితే పార్టీ అధినేతగా మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేస్తూ తెలంగాణ ఎన్నికల నుంచి పార్టీని పూర్తిగా వైదొలగాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ తెలుగుదేశం అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు రాజకీయాల కంటే నా సామాజికవర్గ సంక్షేమమే ముఖ్యం. ఇక ముందు కూడా బీసీ కులాల ఐక్యత, ముదిరాజ్ ల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాను. ధన్యవాదాలు

మీ విశ్వాసపాత్ర ముదిరాజ్ కాసాని జ్ఞానేశ్వర్.

మరి ఇది టీడీపీ కి బిగ్ షాక్ అనే చెప్పాలి. 

Big shock for TDP:

Kasani Gnaneshwar Resigned From TDP

Tags:   KASANI GNANESHWAR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement