సాయి రాజేష్ దర్శకుడిగా ఆనంద్ దేవరకొండ హీరోగా.. యూట్యూబర్ వైష్ణవి ఛైతన్య, విరాజ్ అశ్విన్ కలయికలో తెరకెక్కిన బేబీ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షము కురిపించింది. ముందుగా ఓటిటి రిలీజ్ అనుకున్న మేకర్స్.. కంటెంట్ మీద నమ్మకంతో ఆ సినిమాని థియేటర్స్ లో విడుదల చేసారు. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న బేబీ మూవీ ఆ తర్వాత అదిరిపోయే కలెక్షన్స్ తో నిర్మాతలని లాభాల బాట పట్టించింది.
అయితే ఈ చిత్రం తర్వాత సాయి రాజేష్ సంతోష్ శోభన్ హీరోగా మరో మూవీ మొదలు పెట్టారు. అటు ఆనంద్ దేవరకొండ-వైష్ణవి ఛైతన్య హీరో హీరోయిన్స్ గా మరో ప్రాజెక్ట్ మొదలుకాబోతుంది. ఇప్పుడు సాయి రాజేష్ బేబీ మూవీని హిందీలో రీమేక్ చెయ్యడానికి సిద్ధమవుతున్నాడట. నార్త్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుంది అని చెబుతున్నారు. మరి ఆనంద్ దేవరకొండ-విరాజ్ అశ్విన్ ప్లేస్ లో ఎవరు నటిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక్కడ సూపర్ హిట్ అయిన బేబీ మూవీ హిందీలో ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో.. ఈ కంటెంట్ కి నార్త్ ఆడియన్స్ కి ఏంతగా కనెక్ట్ అవుతారో అనే ఆసక్తి అందరిలో మొదలైంది.