బిగ్ బాస్ సీజన్ 7 లో సిల్లీ రీజన్స్ తో టేస్టీ తేజ కొంతమంది హౌస్ మేట్స్ ని నామినేట్ చెయ్యగా వారు వరసగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. తేజ నాకు ఎవరి మీదా కోపం లేదు అంటూనే నయని పావని, పూజ, సందీప్ లని వరసగా చిన్న చిన్న రీజన్స్ తో నామినేట్ చేసాడు. వాళ్ళు కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోతున్నారు. అదే బయట తేజ ఐరెన్ లెగ్ అంటూ మట్లాడుకునేలా చేసింది.
ఈరోజు నామినేషన్స్ లో తేజ ని శివాజీ డైరెక్ట్ గానే టార్గెట్ చేసాడు. సోమవారం నామినేషన్స్ లో శివాజీ తేజని నామినేట్ చేస్తూ నువ్వు సిల్లీ రీజన్ తో సందీప్ ని ఆ రోజు నామినేట్ చెయ్యకపోతే వాడు ఈరోజు హౌస్ లో ఉండేవాడు నువ్వు తప్పు చేసావ్ అన్నట్టుగా నామినేట్ చేసాడు. దానికి తేజ కూడా అన్న మీరే చెప్పారుగా నామినేట్ చేస్తే హౌస్ నుంచి పంపించెయ్యడం కాదు అని అంటూ శివాజీ కి కౌంటర్ వేసాడు.
ఇక ఈ రోజు నామినేషన్స్ లో ఎక్కువగా రతిక ని టార్గెట్ చేశారనిపించేలా ప్రోమో కట్ ఉంది. అలాగే ఎప్పటిలాగే భోలే కి ప్రియాంకకి మధ్యలో ఫైట్ జరగగా.. ఫ్రెండ్స్ అయిన శివాజీకి-ప్రియాంకకి గొడవైంది. అర్జున్-శోభా శెట్టి మధ్యలో కూడా మాటల యుద్ధమే నడిచిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.