బిగ్ బాస్ సీజన్ 7 లో ఓ వర్గం ఆడియన్స్ కి శివాజీ బాగా నచ్చుతున్నాడు. ఆయన మైండ్ గేమ్ కి ఫిదా అవుతున్నారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా శివాజీ ఒంటి చేత్తో టాస్క్ లో మంచిగానే పర్ ఫామ్ చేస్తున్నాడు. ఏది ఎలా ఉన్నా శివాజీ కొన్ని విషయాలను డీల్ చేసినట్టుగా మరికొన్ని విషయాలను డీల్ చేయలేకపోతున్నాడు. అంటే నామినేషన్స్ లో తనని నామినేట్ చేసినా, లేదంటే కెప్టెన్సీ టాస్క్ నుంచి తనని తీసేసినా బాగా హార్ట్ అవుతున్నాడు.
అమరదీప్, శోభా శెట్టి, ప్రియాంక, సందీప్ మాస్టర్ అంటే ఆయనకి నచ్చదు. శోభా శెట్టి అరుపులు కేకలు ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. పదే పదే ఆయన హౌస్ డిస్టర్బ్ అవుతుంది అనేది కూడా శోభా శెట్టి ని ఉద్దేశించే. భోలే ని క్షమించలేను అన్నందుకు శోభా శెట్టి ని, ప్రియాంకని నామినేట్ చేసాడు, అలాగే అమరదీప్ ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. తన పక్కన పల్లవి ప్రశాంత్, యావర్ ఉంటారు. తేజాని తన బ్యాచ్ లోకి లాగాలని చూస్తున్నాడు.
అప్పుడప్పుడు శోభా శెట్టిపై శివాజీ తేజ కి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు. అయితే నిన్న ఈ గ్రూప్ నుంచి సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. దానితో శివాజీ ఫుల్ ఖుషి అయ్యి ఉంటాడు అంటూ సందీప్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్యాచ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయినా శివాజీకి పట్టరాని సంతోషం. సందీప్ మాస్టర్.. అమరదీప్, శోభా, ప్రియాంక గ్రూప్ వాడు.. అందుకే ఆయన ఎలిమినేట్ అయితే శివాజీకి ఫుల్ హ్యాపీ అంటూ మాట్లాడుకుంటున్నారు. సందీప్ అభిమానులు శివాజిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.