బిగ్ బాస్ సీజన్ 7 లో టేస్టీ తేజాని చూస్తే ఇప్పుడు హౌస్ మేట్స్ మాత్రమే కాదు.. బయట వాళ్ళ అభిమానులు కూడా భయపడిపోతున్నారు. హౌస్ లో జస్ట్ కామెడీతో నెట్టుకొస్తూ టాస్క్ ల పరంగా నా వల్ల ఇంతే అయ్యింది అంటూ చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్న తేజ.. ఎనిమిది వారాలుగా శోభా శెట్టి స్నేహన్ని బాగానే వాడేస్తున్నాడు. అయితే టేస్టీ తేజ స్ట్రాంగ్ రీజన్స్ లేకుండా నామినేషన్స్ లో కొంతమందిని నామినేట్ చెయ్యడమే హౌస్ లో చాలామందికి నచ్చడం లేదు.
అది సరే.. తేజ ఎవరిని సిల్లీగా నామినేట్ చేసినా వాళ్ళు వరసగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా నయని పావని తేజాని నామినేట్ చెయ్యగా.. తేజ తిరిగి ఆమెని నామినేట్ చేసాడు. అదే వారం నయని పావని హౌస్ నుంచి వెళ్ళిపోయింది. ఆ తరవాత పూజ తనని తరచూ టార్గెట్ చేస్తుంది అని, తన చెవిలో నీళ్లు పోసింది అంటూ సిల్లీగా ఆమెని నామినేషన్స్ లోకి తీసుకొచ్చాడు. ఆ వారమే పూజ ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారమూ అంతే.. తేజ సందీప్ మాస్టర్ ని సిల్లీగా నామినేట్ చెయ్యగా.. సందీప్ మాస్టర్ అతన్ని హాగ్ చేసుకున్నాడు కూడా. ఎనిమిది వారాలుగా నామినేషన్స్ లోకి రాని సందీప్ మాస్టర్. తేజ నామినేషన్ తో మొదటిసారి నామినేషన్ లోకి రావడమే.. అతను ఎలిమినేట్ అయ్యాడు.
తేజ ఎవరిని నామినేట్ చేస్తే వారు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారంటూ, తేజది ఐరెన్ లెగ్ అంటూ బయట ఎలిమినేట్ అయిన వారి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సందీప్ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడేటప్పుడు కూడా తేజ అయోమయంగా తన వల్లే మాస్టర్ ఎలిమినేట్ అయ్యారనేలా చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.