రుక్మిణి.. రుక్మిణి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది..! ఎవరీమె.. ఎందుకింతలా పాపులర్ అయ్యింది.. అనేది తెలుసుకోవడానికి జనాలు గూగుల్ తల్లిని తెగ అడిగేస్తున్నారు..! ఆమె మరెవరో కాదండోయ్.. రుక్మిణి కోట..! ప్రస్తుతం జనసేనకు అన్నీ తానై చూసుకుంటున్న ఏకైక మహిళా నేత. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే జనసేనలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తర్వాత రుక్మిణీయే నంబర్ త్రీ. ప్రస్తుతం ఈమె వ్యక్తిగత, రాజకీయ వ్యవహారాలను చూసుకుంటున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అతి తక్కువ సమయంలోనే కీలక నేతగా గుర్తింపు పొందారు. అది కూడా ఎలాగంటే.. రుక్మిణీని ప్రసన్నం చేసుకుంటేనే.. పవన్ కల్యాణ్ దగ్గరికి చేరుకోగలమనే స్థాయికి ఎదిగారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. జనసేన శ్రేణులు, మెగాభిమానులకు పవన్ దేవుడైతే.. భక్తులకు-ఆయనకు అనుసంధానకర్తే రుక్మిణి. ఇప్పుడు అర్థం అయ్యింది కదా.. రుక్మిణీ రేంజ్ ఏంటి అనేది.. అదన్న మాట సంగతి.
ఎవరీ రుక్మిణి..!
రుక్మిణి మరెవరో కాదు.. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మహిళే.. 2022 వరకూ లండన్‌లో ఉండేవారు. జనసేన వీరమహిళలను పార్టీ కేటాయించగా అందులో ఒక్కరే ఈమె. పవన్ ఎప్పుడు విదేశాలకు వెళ్లినా సరే షెడ్యూల్ మొదలుకుని సకల సౌకర్యాలన్నీ రుక్మిణియే చూసుకునేవారన్నది జనసేన శ్రేణులు చెబుతున్న మాట. ఆ తర్వాత 2020లో పార్టీకి ఈమె చేస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటి వైస్ చైర్మన్‌గా నియమించడం జరిగింది. ఆ తర్వాతే రెండేళ్లకు పూర్తిగా లండన్ వదిలేసి హైదరాబాద్‌కు మకాం మార్చేశారు. నాటి నుంచి నేటి వరకూ హైదరాబాద్‌లో ఉన్న జనసేన కార్యాలయం బాధ్యతలను రుక్మిణికే పవన్ అప్పగించారు. అయితే.. అదేం కాదు.. ఆమె స్వాధీనం చేసుకునే స్థాయికి ఎదిగారనే టాక్ కూడా పెద్ద ఎత్తునే నడుస్తోంది. పవన్ సామాన్యంగా ఎవర్నీ నమ్మరు.. అలాంటిది రుక్మిణిని చేరదీశారంటే ప్రతిభ అలాంటిదని అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి.
అప్పుడే అవ్వలేదు..!
ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఇప్పుడే అసలు కథ మొదలైంది. 2023 జూన్ నుంచి జనసేన కార్యాలయంలో పనిచేసే 30 మందిని ఉన్న ఫళంగా తీసేశారనే విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే.. తాను చెప్పినట్లు వినే టీమ్ ఉండాలని కొత్త టీమ్‌ను రంగంలోకి దించారట. ఇందులో ఆరుగురు మహిళలు, ఒక దివ్యాంగుడు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఎలాంటి సమచారం లేకుండా ఇలా తొలగించడంతో ఆ 30 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. సాధారణ కార్యకర్త నుంచి కీలక నేతగా ఎదగడం.. పవన్ దగ్గర మంచి ఆదరణ కలిగి ఉండటం అంతవరకూ ఓకేగానీ.. పార్టీ తనకిచ్చిన అధికారాలను ఇష్టానుసారం వాడేస్తున్నారనే ఆరోపణలు కోకొల్లలు. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఎంత పెద్ద తోపుగాడు అయినా సరే.. అది పార్టీలో వారైనా, బయటివారైనా పవన్‌ను కలవాలంటే మొదట రుక్కిణిని ప్రసన్నం చేసుకోవాల్సిందే.. ఆమె కరుణిస్తేనే ముందుకు.. లేకుంటే అంతే సంగతులట. ఇదంతా జనసేన కార్యకర్తలు గుసగుసలాడుతుండగా బయటికొచ్చిన విషయాలు. మొత్తానికి చూస్తే.. నిన్న, మొన్నటి వరకూ జనసేనలో నాదెండ్ల ఏం చెప్పినా జరిగేది కానీ.. ఇప్పుడు రుక్మిణి రావాల్సిందే.. ఆమె ఆశీర్వాదాలు ఉంటేనే ముందుకెళ్లలాన్న మాట. ఈ మధ్య మనోహర్‌ను పవన్ పక్కనెట్టినట్లు.. సర్వం రుక్మిణీయేనని టాక్.. చూశారుగా.. ఇదీ రుక్మిణి కథ.!