Advertisementt

అర్జున్ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం

Sun 29th Oct 2023 04:04 PM
arjun sarja  అర్జున్ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం
Arjun daughter Aishwarya is engaged అర్జున్ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం
Advertisement
Ads by CJ

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం.. కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడైన తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతి రామయ్యతో శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలో అర్జున్ నిర్మించిన హనుమాన్ టెంపుల్‌లో ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఇరు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. నిశ్చితార్థం అనంతరం ఐశ్వర్య, ఉమాపతిల వివాహం 2024 సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో ఉంటుందని అర్జున్ సర్జా తెలిపారు. ఈ నిశ్చితార్థానికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, బంధువులను మాత్రమే పిలిచామని.. పెళ్లికి మాత్రం అందరినీ ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా అర్జున్ సర్జా మీడియాకు తెలియజేశారు.

ఈ నిశ్చితార్థ వేడుకలో ఉమాపతి రామయ్య డ్రస్‌ని ముంబైకి చెందిన మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా.. ఐశ్వర్య అర్జున్ ధరించిన డ్రస్‌ను జయంతి రెడ్డి డిజైన్ చేశారు. 5 క్యారెట్ బర్మీస్ రూబీ విత్ డైమండ్ అండ్ వైట్ గోల్డ్‌తో చేసిన రింగ్స్‌ని ఐశ్వర్య అర్జున్ ధరించగా.. ఉమాపతి కూడా గోల్డ్ అండ్ డైమండ్ రూబీ ధరించారు. అర్జున్ నిర్మించిన హనుమాన్ టెంపుల్‌లోని రాములువారి విగ్రహం ముందు ఐశ్వర్య-ఉమాపతి నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నట్లుగా అర్జున్ సర్జా చెప్పుకొచ్చారు.

Arjun daughter Aishwarya is engaged:

Arjun Sarja daughter Aishwarya gets engaged to Umapathy

Tags:   ARJUN SARJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ