మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఒక్కొక్కరిగా ఇటలీకి పయనమయ్యారు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ, మెగాస్టార్ చిరు ఫ్యామిలీ ఇలా జంటలుగా అందరూ ఇటలీ ఫ్లైట్ ఎక్కారు. ఇక ఇటలీలో టుస్కనీ నగరంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల పెళ్ళికి ఏర్పాట్లు ఘనంగా మొదలయ్యాయి.
రేపు అక్టోబర్ 30న కాక్ టైల్ పార్టీతో ఈ వెడ్డింగ్ వేడుకలు మొదలు కానున్నాయని తెలుస్తుంది. అలాగే మంగళవారం హల్దీ ఫంక్షన్, మెహిందీ, సంగీత్ నిర్వహించబోతున్నారు. బుధవారం నవంబర్ 1 న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం జరగబోతుంది. ఇక ఈ పెళ్ళికి ఇరు కుటుంబాల వారే హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. పెళ్లి తర్వాత వరుణ్-లావణ్యల జంట హైదరాబాద్‌కి తిరిగొస్తారు.
నవంబర్ 5న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వరుణ్ తేజ్-లావణ్యల వెడ్డింగ్ రిసెప్షన్‌కి నాగబాబు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇటలీలో జరగబోయే వరుణ్ వివాహ వేడుకలకి మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి వెళ్లినా.. మెగాస్టార్ తల్లిగారు అనారోగ్య కారణాల దృష్ట్యా ఆమె ఇటలీకి వెళ్లడం లేదని తెలుస్తోంది.