బిగ్ బాస్ సీజన్ 7 లో ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆత్రుత అందరికి ఉంది. ఎందుకంటే ఈవారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఇద్దరిని సేవ్ చేసారు. అందులో కెప్టెన్ గౌతమ్ అలాగే ప్రియాంక లు సేవ్ అయ్యారు. మిగిలిన శోభా శెట్టి, శివాజీ, అమరదీప్, సందీప్ మాస్టర్, అశ్విని లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని అనుకుంటున్నారు. ఇందులో అశ్విని వీక్ అనుకున్నా ఆమె ఆటలో స్ట్రాంగ్ గా తయారైంది. ఇక శోభా శెట్టి అరిచినా ఎలా ఉన్నా ఆమె కూడా టాస్క్ ల పరంగా చాలా స్ట్రాంగ్.
ఇక శివాజీకి బయట బాగా క్రేజ్ ఉంది. అయితే మొదటి వారం నుంచి గత వారం వరకు వరసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఏ సీజన్ లోను లేదు ఇలా. ఫస్ట్ టైమ్ ఏడో సీజన్ లో వరసగా లేడీ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోతున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆత్రుత అందరిలో ఉండగా.. సందీప్ మాస్టర్ ఎలిమినేషన్ పూర్తయినట్లుగా తెలుస్తుంది. సందీప్ మాస్టర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవేసుకోవడం అతనికి మైనస్ అయ్యింది అంతేకాకుండా.. మొదటి ఐదు వారాలుగా అతను ఇమ్యూనిటీ పొంది నామినేషన్స్ లోకి రాకపోవడం మైనస్ అంటున్నారు.
అంటే నామినేషన్స్ లోకి వస్తే బుల్లితెర ప్రేక్షకుల మైండ్స్ లో ఆ పేరు రిజిస్టర్ అయ్యి ఉండేది, ఇప్పుడు మొదటిసారిగా నామినేషన్ లోకి వచ్చినా సందీప్ కి ఓట్స్ పడలేని కారణంగానే స్ట్రాంగ్ అయినా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అంటున్నారు. సందీప్ మాస్టర్ ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చాడు, అదే వారం ఎలిమినేట్ అయ్యాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈరోజు రాత్రి ఎలిమినేషన్ ఎపిసోడ్ పూర్తయ్యేవరకు ఇది కేవలం లీకు వార్తే.